లారీ, కారు ఢీ - నలుగురికి గాయాలు

ABN , First Publish Date - 2022-06-26T04:44:45+05:30 IST

కడప-చెన్నై జాతీ య రహదారిపై ఒంటిమిట్ట రామతీర్ధం సమీపంలో లారీని కారు ఢీకొనగా నలు గురికి గాయలయ్యాయి.

లారీ, కారు ఢీ - నలుగురికి గాయాలు
రోడ్డుకు అడ్డంగా పడిన లారీ

నాలుగు గంటలు ఎన్‌హెచ్‌పై ట్రాఫిక్‌ జామ్‌ 

కూతవేటులో ఉన్నా స్పందించని పోలీసులు

ఒంటిమిట్ట, జూన్‌25: కడప-చెన్నై జాతీ య రహదారిపై ఒంటిమిట్ట రామతీర్ధం సమీపంలో లారీని కారు ఢీకొనగా నలు గురికి గాయలయ్యాయి. సుమారు నాలు గు గంటల పాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్థంభించడం, కూతవేటులో ఉన్న పోలీసుస్టేషన్‌ నుంచి పోలీసులు స్పందిం చక పోవడాన్ని పలువురు విమర్శించారు. సంఘటన వివరాల్లోకెళితే.... 

 హైదరాబాదు నుంచి తిరుమలకు వెళుతున్న టీఎస్‌11ఈ14450 బ్రెజ్జా వా హనం ఉదయం 6గంటలకు రామతీర్థం వద్ద వెళుతోంది. అదే సమయంలో  బొ గ్గులోడుతో వస్తున్న లారీని కారు ఢీకొని చెరువులోకి పడుతుందని గ్రహించిన లారీ డ్రైవరు బ్రేక్‌ వేశాడు. దీంతో ఒక్క సారిగా అదుపు తప్పిన లారీ దారికి అడ్డంగా తిరిగి బోల్తాపడింది. దీంతో కారులోని ఎయిర్‌బెలూన్స్‌ ఓపెన్‌ కావ డంతో కారులో ప్రయాణికులు ప్రాణా లతో బయటపడ్డారు. వాహనాలు చెరువులోకి దూసుకుపోకుండా తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థా నికులు, ప్రయాణీకులు రిమ్స్‌కు తరలిం చారు. రాజేష్‌, మధు, కృష్ణమూర్తి  గాయ పడ్డారని పోలీసులు తెలిపారు.

ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాహ నాలు నిలిచిపోవడంతో వాహనాదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రత్యా మ్నాయంగా కొత్తపల్లె, గంగపేరూరు, పెన్నపేరూరు, ఇబ్రహీంపేట మీదుగా వాహనాలను మళ్లించారు. అయినా కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవంతో విద్యార్థులు, చంటి పిల్లలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రెండుగంటల తరు వాత ఎక్స్‌కవేటర్‌, క్రేన్‌తో పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు. 2గంట లు శ్రమించిన అనంతరం ట్రాఫిక్‌ను తొలగించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలి పారు. సిబ్బంది రంతుబాష, ఎస్‌బీ హెడ్‌ కానిస్టేబుల్‌ సుబ్బారెడ్డి  పాల్గొన్నారు.

స్పందించని పోలీసులు

కడప-చెన్నై జాతీయ రహదారిపై కారు- లారీ ఢీకొన్న ఘటనలో రోడ్డుకు అడ్డంగా లారీ పడడంతో సహాయ చర్యలు చేప ట్టేందుకు పోలీసులు వెంటనే స్పందించ లేదని ప్రయాణికులు విమర్శించారు. ఉద యం 6గంటలకు ఘటన జరిగితే 7గంట ల వరకు హైవే పోలీసులు కానీ, స్థానిక పోలీసులు కానీ ఘటనా స్థలానికి చేరుకో లేదని ప్రయాణికులు పెదవి విరుస్తున్నా రు. కూతవేటు దూరంలో పోలీస్‌స్టేషన్‌ ఉన్నా సిబ్బంది మొత్తం బందోబస్తుకు వెళ్లడంతో అందుబాటులోకి రాకపోవడం, తక్షణ సహాయక చర్యలు చేపట్టలేక పోయామని పోలీసులు తెలిపారు.







Updated Date - 2022-06-26T04:44:45+05:30 IST