బోల్తా పడిన లారీ
డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
బొండపల్లి, జనవరి 20: అతి వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పడంతో బోల్తాపడి దిగువనున్న పొలాల్లోకి వెళ్లి తలక్రిందులైన సంఘటన గురువారం వేకువజా మున చోటు చేసుకుంది. సంఘటన కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ నుంచి విశాఖపట్టణానికి ఐరెన్ ఓర్ లోడుతో వెళుతున్న లారీ ప్రమాదవ శాత్తు నెలివాడ జంక్షన్‌లోని జాతీయ రహదారి 26 పక్కన గల రాజ చెరువు దిగువ పొలాల్లోకి వెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా తలకిందు లు కాగా అదే రాష్ట్రం సిద్ధి జిల్లాకు చెందిన దినరక్‌షాహకు తీవ్ర గాయాలయ్యా యి. గాయపడిన డ్రైవర్‌ను విజయనగరంలోని మహరాజా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.