దేశంలోనే అతిపెద్ద సోలార్‌ కార్‌పోర్ట్‌

ABN , First Publish Date - 2021-06-19T07:00:06+05:30 IST

భారత్‌లోనే అతిపెద్ద సోలార్‌ కార్‌పోర్ట్‌ను టాటా మోటార్స్‌ ఏర్పాటు చేసింది. పుణెలోని చిక్కాలిలో ఉన్న తన ప్లాంట్‌లో 30 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో కార్‌ పార్కింగ్‌ షెడ్ల తరహాలో ఈ సోలార్‌

దేశంలోనే అతిపెద్ద సోలార్‌ కార్‌పోర్ట్‌

పుణెలోని ప్లాంట్‌లో ఏర్పాటుచేసిన టాటా మోటార్స్‌


ముంబై, జూన్‌ 18: భారత్‌లోనే అతిపెద్ద సోలార్‌ కార్‌పోర్ట్‌ను టాటా మోటార్స్‌ ఏర్పాటు చేసింది. పుణెలోని చిక్కాలిలో ఉన్న తన ప్లాంట్‌లో 30 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో కార్‌ పార్కింగ్‌ షెడ్ల తరహాలో ఈ సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేసింది. టాటా మోటార్స్‌, టాటా పవర్‌ సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేశాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన 6.2 మెగావాట్ల పవర్‌ కలిగిన సోలార్‌ ప్యానెళ్లు ఏడాదికి 86.4 లక్షల కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయని టాటా పవర్‌ వెల్లడించింది.


ఈ సోలార్‌ ప్యానెళ్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే కాదు.. వాటి కింద ప్లాంట్‌లో టాటా మోటార్స్‌ తయారు చేసిన నూతన కార్లను పార్కింగ్‌ కూడా చేసుకునేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేశారు. ఈ సోలార్‌ పవర్‌ వినియోగం ద్వారా కర్బన ఉద్గారాల విడుదలను కూడా గణనీయంగా తగ్గించవచ్చని టాటా పవర్‌ పేర్కొంది.

Updated Date - 2021-06-19T07:00:06+05:30 IST