Abn logo
Apr 20 2021 @ 23:56PM

నవమి వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

ముస్తాబైన రామాలయాలు

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 20:
పట్టణంలోని రామాలయాలు శ్రీరామనవమికి ముస్తాబయ్యాయి. ఆలయాలు, విగ్రహాలకు రంగులు అద్ది వేడుకకు సిద్ధం చేశారు. అలాగే ఆలయాల ముందు తాటాకు పందిళ్లు వేశారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి రావాలని ప్రచారం చేశారు. బుధవారం ఉదయం 10 గంటలు తరువాత సీతారాముల కల్యాణం శాస్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.


కశింకోటలో...
కశింకోట:
సీతారాములవారి కల్యాణానికి రామాలయాలు ముస్తాబయ్యాయి. కశింకోటలోని కోదండసీతారామాలయం, కస్పావీధి, గవరపేట శారదాగణపతి రామాలయాల్లో కల్యాణానికి ఏర్పాట్లు చేశారు.

Advertisement
Advertisement
Advertisement