గ్రామాల అభివృద్ధికి పెద్దపీట

ABN , First Publish Date - 2022-06-27T04:36:56+05:30 IST

మారుమూల గ్రామాల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
మంత్రిని కలిసిన దావుత్‌గూడ గ్రామస్తులు

  • విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి 


కందుకూరు, జూన్‌ 26 : మారుమూల గ్రామాల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కందుకూరు మండలం దావుత్‌గూడ  గ్రామంలో చేపట్టనున్న అంగన్‌వాడీ స్కూల్‌. ప్రాథమిక పాఠశాల భవనాల నిర్మాణం, సీసీరోడ్లకు మరో పదిలక్షల రూపాయల నిధులను మంత్రి మంజూరు చేశారు. దీంతో ఆదివారం ఆ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, పంచాయతీ పాలకవర్గం సభ్యులు మంత్రి నివాసానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పూర్వం అనుబంధ గ్రామాల ప్రజలు అభివృద్ధి, మౌలిక వనరుల కల్పనకు అనేక ఇబ్బందుల ఎదుర్కొంటునట్లు మంత్రి గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ అనుబంధ గ్రామాలు, గూడేలను ప్రత్యేక పంచాయతీలుగా మంజూరు చేయడంతో అవి పట్టణ ప్రాంతాలుగా అభివృద్ధి చెందినట్లు తెలిపారు. అందులోభాగంగానే దావుత్‌గూడ గ్రామంలో సెంటర్‌లైటింగ్‌, సీసీరోడ్లు వేయడం ద్వారా అభివృద్ధిలో మరింత పురోగతి చెందినట్లు తెలిపారు. గ్రామంలో మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ విజయరాజునాయక్‌, వార్డు సభ్యులు తేజనాయక్‌, హున్యానాయక్‌, నాయకులు దాసునాయక్‌, విజసేవ్యానాయక్‌, జవహర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-27T04:36:56+05:30 IST