పంచాయతీ భవన నిర్మాణాలకు పెద్దపీట

ABN , First Publish Date - 2021-11-28T05:27:20+05:30 IST

పంచాయతీ భవన నిర్మాణాలకు పెద్దపీట

పంచాయతీ భవన నిర్మాణాలకు పెద్దపీట
నిధుల మంజూరు ప్రొసిడింగ్‌ను అందజేస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కందుకూరు: పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటైన ప్రతి గ్రామ పంచాయతీల్లో నూతన పంచాయతీ భవనా లను నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ధన్నారం పంచాయతీ భవన నిర్మాణానికి మంజూరైన రూ.20లక్షల ప్రొసిడింగ్‌ను శనివారం జడ్పీటీసీ బొక్క జంగారెడ్డితో కలిసి గ్రామస్థులకు అందజేశారు. ఈ సంద ర్భంగా మంత్రి సబిత మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు 500జనాభా ఉన్న అనుబంధ మరియు గిరిజన తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటయ్యాయన్నారు. అందులో భాగంగా కందుకూరు మండలంలో కొత్తగా 12 పంచాయతీలు ఏర్పడ్డా యన్నారు. ఇప్పటివరకు సరస్వతిగూడ, బాచు పల్లికి నూతనంగా పంచాయతీ భవనాల నిర్మాణ పనులకు నిధులు మంజూరయ్యాయని మంత్రి చెప్పారు. శనివారం ధన్నారం గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ:20లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలో కొత్త గ్రామ పంచాయతీలతో పాటు శిథిలావస్థకు చేరుకున్న పంచాయతీలకు బదులు కొత్తవి నిర్మిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో మహేశ్వరం మార్కెట్‌ కమిటీ డైరక్టర్‌ పిట్టల పాండు, టీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షుడు మన్నె జయేందర్‌, ఉపాధ్యక్షుడు పాండుగౌడ్‌, ఎస్‌.సురేందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T05:27:20+05:30 IST