ప్రభుత్వ కళాశాలలో విద్యకు పెద్దపీట

ABN , First Publish Date - 2022-05-26T03:59:53+05:30 IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యకు పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే నివాసంలో 2022-23 విద్యా సంవత్సరానికి దోస్త్‌ ద్వారా డిగ్రీ ప్రథమ సంవత్సరం అడ్మిషన్‌ వాల్‌ పోస్టర్లను కళాశాల ప్రిన్సిపాల్‌ చక్రపాణితో కలిసి విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు.

ప్రభుత్వ కళాశాలలో విద్యకు పెద్దపీట
పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు

ఏసీసీ, మే 25: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యకు పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే నివాసంలో 2022-23 విద్యా సంవత్సరానికి దోస్త్‌ ద్వారా డిగ్రీ ప్రథమ సంవత్సరం అడ్మిషన్‌ వాల్‌ పోస్టర్లను కళాశాల ప్రిన్సిపాల్‌ చక్రపాణితో కలిసి విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ఇంటర్‌ పూర్తయిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని, విద్యార్థుల సౌకర్యార్ధం ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి కాలేజీ వరకు ఉదయం, సాయంత్రం బస్సులు నడుస్తాయని  తెలిపారు. అసంపూర్తిగా ఉన్న ప్రహారీ గోడను నిర్మిస్తామని, మహిళా కళాశాల కోసం కేటాయించిన భవనాన్ని డిగ్రీ కళాశాల హాస్టల్‌ భవనంగా మార్చడానికి కృషి చేస్తామన్నారు. అధ్యాపకులు, పూర్వ విద్యా ర్థులు, సింగిల్‌ విండో చైర్మన్‌ వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

మున్సిపల్‌ కార్మికుల వినతి

మంచిర్యాల మున్సిపాలిటీ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఏడు నెలలుగా రావాల్సిన ఏరియర్స్‌ ఇప్పించాలని ఎమ్మెల్యే దివాకర్‌రావుకు బుధవారం ఆయన నివాసంలో కార్మికులు వినతి పత్రం అందించారు. మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిశారు. కార్మికులకు చెల్లించాల్సిన ఏరియర్స్‌ వీలైనంత త్వరగా చెల్లించాలని కమిషనర్‌ను ఫోన్‌లో ఆదేశించారు.  

 

Updated Date - 2022-05-26T03:59:53+05:30 IST