రాజస్థాన్‌లో పెద్ద సంఖ్యలో బయటపడిన షార్క్ దంతాలు

ABN , First Publish Date - 2020-06-05T01:28:32+05:30 IST

రాజస్థాన్‌లోని బార్మెర్ జిల్లాలో ఉన్న శిలాజ ప్రదేశంలో పెద్ద సంఖ్యలో షార్క్(సొరచేప) దంతాలు బయటపడ్డాయి. ఈ

రాజస్థాన్‌లో పెద్ద సంఖ్యలో బయటపడిన షార్క్ దంతాలు

బార్మెర్: రాజస్థాన్‌లోని బార్మెర్ జిల్లాలో ఉన్న శిలాజ ప్రదేశంలో పెద్ద సంఖ్యలో షార్క్(సొరచేప) దంతాలు బయటపడ్డాయి. ఈ అధ్యయనం వెచ్చని, తేమతో కూడిన, తీరప్రాంత పరిస్థితుల నుంచి నేటి పొడి వాతావరణం, ఎడారి వాతావరణ పరిస్థితుల వరకు ఈ ప్రాంతంలో పర్యావరణ మార్పుల గురించి విలువైన అవగాహనను పెంపొందించింది.


ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన భూగర్భ శాస్త్ర విభాగం చేసిన ఈ పరిశోధన ఇటీవల ‘జియోబియోస్’ జర్నల్‌లో ప్రచురితమైంది. ‘‘క్రెటేషియస్నుంచి నుంచి ఈయోసిన్ యుగం మధ్య శిలాజ అంతరాన్ని పూరించేందుకు మా బృందం బార్మర్ జిల్లాలో క్షేత్ర పరిశోధన నిర్వహించింది. ఇది బార్మర్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో, దక్షిణాన గిరాల్ లిగ్నైట్ గనికి మూడు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మారావు ఓపెన్ కాస్ట్ క్వారీ అని పిలిచే కొత్త శిలాజ స్థలాన్ని కనుగొనడానికి దారితీసింది. వివిధ రకాల సొర చేపలు స్క్వాటిస్కిలియం నైజీరిన్సిస్, గింగ్లీమోస్టోమా సోకోటోయెన్స్ మొదలైన సొరచేప దంతాలు పెద్ద ఎత్తున ఇక్కడ బయటపడ్డాయి’’ అని పరిశోధనకు సారథ్యం వహించిన డాక్టర్ ప్రియదర్శిని రాజ్‌కుమారి తెలిపారు.  


పశ్చిమ రాజస్థాన్‌లోని ఫతేగఢ్ ఫార్మేషన్, కపుర్ది ఫార్మేషన్, అక్లిఫార్మేషన్ల నుంచి స్వాధీనం చేసుకున్న శిలాజాలతో వీటిని పోల్చి చూసినప్పుడు ఈ కొత్త శిలాజ సైట్ పాలియో ఎన్విరాన్‌మెంట్, పాలియోఎకాలజీ ఇతర శిలాజ ప్రదేశాలకు భిన్నంగా ఉన్నట్టు కనుగొన్నారు.   

Updated Date - 2020-06-05T01:28:32+05:30 IST