ప్రాణాలతో చెలగాటం

ABN , First Publish Date - 2020-05-22T11:11:55+05:30 IST

సీజనల్‌గా లభించే మామిడి పండ్లను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికి ఇష్టమైన

ప్రాణాలతో చెలగాటం

మామిడి పండ్ల పక్వానికి కార్బయిడ్‌ రసాయనాల వాడకం 

తెలియకుండానే చుట్టుముడుతున్న భయంకర వ్యాధులు 

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులు

మహారాష్ట్ర నుంచి భారీగా పండ్ల దిగుమతి


ఆదిలాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): సీజనల్‌గా లభించే మామిడి పండ్లను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికి ఇష్టమైన మధుర ఫలం మామిడి పండు. చూడగానే నోరూరించే మామిడి పండ్లు కొందరు వ్యాపారులకు కాసులు కురిపి స్తున్నాయి. అతి తక్కువ సమయంలోనే అధికంగా సంపాదించాలన్న అతి ఆశతో దళా రులు ప్రజల ఆరోగ్యాన్ని పుండుచేస్తున్నారు. మామిడి కాయలను త్వరగా పక్వానికి తెచ్చేం దుకు విషపూరితమైన ఇథిలిన్‌, కార్బైడ్‌ రసాయనాలను వాడుతూ ప్రజల ఆరోగ్యంతో చలగాటమాడుతున్నారు. జిల్లాలో మామిడి పంట అంతంత మాత్రంగానే ఉండడంతో పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి నిత్యం భారీగా మామిడి కాయలను దిగుమతి చేసుకుంటున్నారు.


ఇలా దిగుమతి చేసుకున్న కాయలను పట్టణం లోని చాందా(టి)కి వెళ్లే దారిలో, సీసీఐ పరిసర ప్రాం తం, మున్సిపల్‌ అద్దె మడిగెల్లో నిలువ చేసి గుట్టు చప్పుడు కాకుండా మాగపెడుతున్నారు. రెండు రోజుల్లో పక్వానికి వచ్చిన పండ్లను అమాయక గిరిజన ప్రాంతాలైన ఉట్నూర్‌, ఇచ్చోడ, బోథ్‌, ఇంద్రవెల్లికి సరఫరా చేస్తూ లక్షల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఉన్నత న్యాయస్థానం సీరియస్‌గా తీసుకున్నా.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల్లో కదలిక కనిపించడం లేదు. 


కృత్రిమ పద్ధతిలో మాగబెడుతున్నారు..

సహజ సిద్ధంగా మామిడి కాయలను మాగ బెట్టాలంటే కనీసం వారం రోజులైన సమయం పడుతుంది. అదే కృత్రిమ పద్ధతిలో రెండు రోజుల నుంచి మూడు రోజుల్లోనే మామిడి కాయలు పక్వానికి వచ్చే అవకాశం ఉంది. కార్బైడ్‌, ఇథిలిన్‌ స్ర్పెలతో మాగబెట్టిన మామిడి పండ్లను సులువు గానే గుర్తుపట్టే అవకాశం ఉంది. మార్కెట్‌లో పండ్లను అమ్మే సమయంలో పండ్లపై అక్కడక్కడ పచ్చని రంగుతో కనిపిస్తాయి. అలాగే పండ్ల తొడి మె భాగం నల్లబడిపోయి నల్లని మచ్చ ఏర్పడు తుంది. తినేటప్పుడు రుచిని కోల్పోయి సప్పగా మారిపోతోంది. ఇలాంటి ఆనవాళ్లు కనిపిస్తే చాలు కచ్చితంగా అవి విషపూరిత రసాయనాలతోనే పక్వానికి వచ్చినట్లేనని గుర్తు పట్టవచ్చు.


విషపూరిత పండ్లను తింటే అనారోగ్యమే..

రసాయన పదార్థాలతో మాగబెట్టిన మామిడి పండ్లను తింటే ఖచ్చితంగా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జీర్ణాశయంపై ప్రభావం చూపి అల్సర్‌, కాలేయ, చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. సహజ సిద్ధమైన పండ్లను తినడంతో ఎంతో మేలు జరుగుతుందో, కృత్రిమంగా మాగబెట్టిన పండ్లను తినడం వలన అంతే ప్రమాదం ఉంటుంది. విషపదార్థాలతో మామిడి పండ్లను మాగబెట్టే సమయంలో వ్యాపా రులు కూడా అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది. చర్మం నల్లబడిపోవడం, చిన్న చిన్న దద్దుర్లు రావడం కనిపిస్తాయి. అదే విధంగా స్ర్తీలలో భయంకర వ్యాధులకు దారితీసే అవకాశం ఉందని స్ర్తీ వైద్య నిపుణులు పేర్కొం టున్నారు. మహా రాష్ట్రతోపాటు నిర్మల్‌, తదితర ప్రాంతాల నుంచి దళారులు విషపూరిత పదార్థాలను కొనుగోలు చేస్తూ వినియోగిస్తున్నట్లు సమాచారం.


గ్రామీణ మహిళలతో అమ్మకాలు..

సీజనల్‌ కన్న ముందే మామిడి పండ్లు మార్కె ట్‌కు రావడానికి అసలు కారణం విషపూరిత పదా ర్థాల వాడకమేనని స్పష్టంగా తెలుస్తోంది. సాధారణంగా మామిడి పండ్ల సీజన్‌ మేలో ఊపందు కుంటుంది. కానీ నెల రోజుల నుంచే మార్కెట్‌లో మామిడి పండ్లు నోరూరిస్తున్నాయి. తొలకరి వర్షాలు పడే వరకు మామిడి పండ్ల సీజన్‌ ఉంటుంది. కానీ గోదాముల్లో మాగబెట్టిన మామిడి పండ్లను కమీషన్‌లపై దినసరి కూలీలకు విక్రయిస్తూ దళారులు చేతులు దులుపుకుంటున్నారు. ఎవరికి అనుమానం రాకుండా గ్రామీణ ప్రాంతాల మహిళలతో మార్కెట్‌కు తరలిస్తూ అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. గడ్డితో కూడిన గుల్లలో  పండ్లను ఉంచుతూ అమ్మచూపుతున్నారు. సహజ సిద్ధమైన పండ్లేనని నమ్మించడంతో ప్రజలు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.


Updated Date - 2020-05-22T11:11:55+05:30 IST