Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎన్నికల ముందు పేదల ఇళ్లపైన బకాయిలురద్దు అన్న జగన్..: లంకా దినకర్

అమరావతి: ఒక్కఛాన్స్ అంటే ఒక్కసారి జగన్‌కు ఓటు వేసినందుకు.. ఓటీఏస్ అంటూ రూ. 10 వేల నుంచి రూ. 20 వేల మధ్య ఇంటింటికి తిరిగి మరి రాబందుల్లా పీక్కు తింటున్నారని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు పేదల ఇళ్లపై ఉన్న బకాయిలు రద్దు చేస్తామన్న జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక ఓటీఏస్ కట్టని పేదల పథకాలు రద్దు అంటున్నారన్నారు. వైయస్సార్సీపీ పాలన మొదటి అర్థ భాగంలో  అస్తవ్యస్థం, అగమ్యగోచరం, అయోమయం జగన్నాథంలా ఉందని ఎద్దేవా చేశారు. గతంలో ప్రభుత్వాలు రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఏదో ఒక మేలు చేశామని చెప్పుకునేవి. ఇప్పుడు జగన్ మాత్రం ప్రతి ఇంటి నుంచి వసూళ్లు మొదలు పెట్టారని ఆరోపించారు. ఓటు కోసం ముద్దు అన్న జగన్.. గుద్దు లేదా రద్దు అంటున్నారన్నారు. భవిష్యత్తులో జగన్ మాకు వద్దని ప్రజలు నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని లంకా దినకర్ అన్నారు.

Advertisement
Advertisement