యూపీలో బీజేపీ ఓటమికి అఖిలేష్‌కు ఏపీ అవినీతి సొమ్ము: లంకా దినకర్

ABN , First Publish Date - 2022-03-17T16:27:28+05:30 IST

యూపీలో బీజేపీ ఓటమికి అఖిలేష్‌కు ఏపీ అవినీతి సొమ్ము వెళ్లిందని లంకా దినకర్ అన్నారు.

యూపీలో బీజేపీ ఓటమికి అఖిలేష్‌కు ఏపీ అవినీతి సొమ్ము: లంకా దినకర్

అమరావతి: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని ఓడించడానికి అఖిలేష్ యాదవ్‌కు ఏపీ పాలకుల నుంచి అవినీతి సొమ్ము పెద్ద ఏత్తున వెళ్లిందని బీజేపీ నేత లంకా దినకర్ ఆరోపించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నిఘా వర్గాలు నిగ్గు తేల్చిన అనంతరం వాస్తవాలు బహిర్గతం చేస్తామన్నారు. ఏపీలోని వైయస్సార్సీపీ నాయకుల ప్రోద్భలంతో తయారు అయ్యే మద్యం అఖిలేష్ యాదవ్ సహకారంతో యూపీలో అమ్మాలనే ప్రణాళిక పారలేదన్నారు.


ఏపీ నుంచి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యూపీ ఎన్నికలలో కీలకంగా వ్యవహరించారని లంకా దినకర్ అన్నారు. "ఏపీ అవినీతి సొమ్ము యూపీ ఏన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా వాడారు" అని చెప్పిన అనంతరం తేలు కుట్టిన పిల్లిలా వైయస్సార్సీపీ నాయకులు నిశబ్దంగా ఉన్నారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అవినీతి సొమ్ము వాడిన వారి బాగోతం బట్ట బయలు అయ్యిందన్నారు. అవినీతి పరుల కూటమి కోసం ప్రయత్నం చేసి విఫలమయ్యారని లంకా దినకర్ ఆరోపించారు. 

Updated Date - 2022-03-17T16:27:28+05:30 IST