రాష్ట్రంలో జగనన్న వసూళ్ల రాజా ప్రభుత్వం నడుస్తోంది: లంకా దినకర్

ABN , First Publish Date - 2022-02-10T17:31:36+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలో జగనన్న వసూళ్ల రాజా ప్రభుత్వం నడుస్తోంది: లంకా దినకర్

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జగనన్న వసూళ్ల రాజా ప్రభుత్వం నడుస్తుందన్నారు. నిన్న అమరావతి మీద విషపు కన్ను పడిందని, ఇవాళ ఆటోనగర్లపైన, రేపు అందరి ఆస్తులపైన పడే ప్రమాదం ఉందన్నారు. ఆటోనగర్ల భూములను యాజమాన్యం కొనుగోలు చేసుకున్న ఆస్తి హక్కు, దాన్ని పీక్కునే హక్కు రాష్ట్ర ప్రభుత్వంకి లేదన్నారు. 


రైతులకు కేంద్రం నుంచి వచ్చే 6 వేల రూపాయలు సహాయం తానే చేశానని చెప్పుకునే జగన్.. ఇప్పుడు రైతుల ముక్కు పిండి వసూళ్లు మొదలు పెట్టారని లంకా దినకర్ విమర్శించారు. ఇబ్బంది పడుతున్న రైతులకు యూరియా అందించే శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కానీ, వత్తిడి చేసి నీటి తీరువా వసూళ్లుపైన శ్రద్ధ మాత్రం ఉందన్నారు. చివరికి జగనన్న మార్ట్ ఏర్పాటు చేయాలంటే ప్రతి ఒక్క స్వయం సహాయక సంఘాల సభ్యుల నుంచి 150 రూపాయలను మెప్మా అధికారులు వసూళ్లు చేయడం దుర్మార్గమని లంకా దినకర్ అన్నారు.

Updated Date - 2022-02-10T17:31:36+05:30 IST