Abn logo
Oct 27 2021 @ 10:33AM

జగన్ ప్రభుత్వంపై లంకా దినకర్ కామెంట్స్

అనంతపురం జిల్లా: జగన్ ప్రభుత్వంపై బీజేపీ నేత లంకా దినకర్ విమర్శలు గుప్పించారు. అనంతపురం జిల్లాలోని బత్తలపల్లికి చెందిన పెద్దన్న భార్య లక్ష్మి దేవి బ్రతికి ఉండగా పాస్ బుక్ ఇవ్వలేని జగన్ ప్రభుత్వం.. ‘శాశ్వత భూ రక్ష - శాశ్వత భూ హక్కు పథకం’ అంటోందని ఎద్దేవా చేశారు. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ రక్ష - శాశ్వత భూ హక్కు’ పథకం అనే పేరు పెట్టడం అంటే ప్రజలు కొనుగోలు లేదా వారసత్వ హక్కు ద్వారా సంక్రమించే భూమి హక్కు ఏమైనా జగనన్న భిక్షనా? అని ప్రశ్నించారు. శాశ్వత హక్కు కోసం భూములు రీ సర్వే అంటేనే ప్రజలకు వణుకు మొదలైందన్నారు. పత్రాలపైన భూమి హక్కుదారు పేరు, ఫోటో ఉంటే చాలు, జగనన్న పేరు, ఫొటోతో పనే ముందని నిలదీశారు. గతంలో క్విడ్ ప్రోకోలో భాగంగా జగన్ ఒత్తిడితో చేసిన భూ సంతర్పణ కేసులు పీడ కలలా ఇప్పటికీ వెంటాడుతున్నాయన్నారు. ఇప్పుడు ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ రక్ష - శాశ్వత భూ హక్కు’ పథకం అంటే ప్రజలకు ‘మా భూ హక్కులు పదిలమేనా’ అని భయపడుతున్నారని లంకా దినకర్ అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption