అమరావతి: కోవిడ్ నిభంధనలు పాటిస్తూ వినాయకచవితి జరుపుకోవాలని భావిస్తున్న భక్తులను ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఏదేచ్ఛగా కోవిడ్ నిభంధనలు ఉల్లంఘిస్తూ వైఏస్సార్ వర్ధంతి రాష్ట్రవ్యాప్తంగా ఏలా చేశారని ప్రశ్నించారు. ఇతర మతాల ఉత్సవాలకు లేని అడ్డదిడ్డమైన అడ్డంకులు వినాయకచవితికి ఏందుకని ప్రశ్నించారు. తిరుపతి, శ్రీశైలం నుంచి భక్తుల విరాళాలను దారి మల్లించే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం వినాయకచవితికి విఘ్నం కలిగిస్తుందని మండిపడ్డారు. గణేష్ ఉత్సవాలను గస్తీ బందోబస్తుతో జరిపించాల్సిన ప్రభుత్వం జబర్దస్తుగా అడ్డుకొనే ప్రయత్నం చేస్తూ భక్తుల మనోభావావలను కించపరుస్తోందని లంకా దినకర్ ఆరోపించారు.