మయన్మార్ లో కొండచరియలు విరిగి పడి 162 మంది మృతి

ABN , First Publish Date - 2020-07-04T01:14:59+05:30 IST

మయన్మార్ లో కొండచరియలు విరిగి పడి 162 మంది మృతి

మయన్మార్ లో  కొండచరియలు విరిగి పడి 162 మంది మృతి

మయన్మార్: ఉత్తర మయన్మార్‌లోని జాడే గని వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద మైనింగ్ కేంద్రమైన హపాకాంట్‌ సమీపంలో కొండచరియలు విరిగి పడి 162 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది. జాడే మైనింగ్ కంపెనీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న మయన్మార్ అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం దాదాపు 12 గంటలపాటు శ్రమించి కొండచరియల కింద పడి ఉన్న 162 మృతదేహాలను వెలికితీశారు. ఇటీవల జరిగిన ఘోర ప్రమాదాల్లో ఈ ఘటన అత్యంత ఘోరమైనదని స్థానికులు చెబుతున్నారు. అసురక్షిత పరిస్థితులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు.


Updated Date - 2020-07-04T01:14:59+05:30 IST