‘మామూలు’గా పిండట్లే

ABN , First Publish Date - 2022-08-10T06:44:16+05:30 IST

జిల్లాల పేదల ఇళ్ల స్థలాలు గతేడాది పంచారు. ఈ క్రమంలో ఊరికి దూరంగా ఉన్న భూములను అధికార పార్టీ పెద్దలు కొందరు అధికారులతో కుమ్మక్కై తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆనక రెట్టింపు రేటుకు ప్రభుత్వా నికి అంటగట్టి కోట్లలో సంపాదించారు.

‘మామూలు’గా పిండట్లే

పేదల ఇళ్ల స్థలాల పేరుతో జిల్లాలో కొందరు అధికార పార్టీ నేతలు కోట్లకు పడగలెత్తుతున్నారు. ఇన్నాళ్లు భూముల కొనుగోలు ముసుగులో కీలక నేతలు కోట్లు సంపాదిస్తే ఇప్పుడు వారి కనుసన్నల్లో అనుచరులు రెచ్చిపోతున్నారు. లక్షలకు లక్షల విలువైన స్థలాన్ని ఉచితంగా ఇస్తున్నందున అడిగినంత మాముళ్లు ఇవ్వాల్సిందేనని లబ్ధిదారుల ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. రాత్రయితే సచివాలయాల వద్ద తిష్ఠ వేసి దందా కొనసాగిస్తున్నారు. ఈ వసూళ్లు వేలు, లక్షలు కాదు ఏకంగా కోట్లలోనే. దీనికి నిలువెత్తు ఉదాహరణే తునిలో ఇటీవల పంచిన ఇళ్ల పట్టాల వ్యవహారం. మొత్తం 4,700 మందికి పట్టాలు ఇవ్వగా కీలక నేత పేరు చెప్పి ఆయన అనుచరులు ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు పిండుతున్నారు. ఇలా రూ.6 కోట్ల వరకు వసూలు చేయడం ప్రారంభించారు.

 తునిలో పేదల ఇళ్ల స్థలాలపై వాలిపోయిన అధికార గెద్దలు

 4 వేల మంది లబ్ధిదారుల నుంచి రూ.6 కోట్ల వరకు అక్రమ వసూళ్లు మొదలు

 లబ్ధిదారుల నుంచి ఏకంగా రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు నొక్కుడు

 చక్రం తిప్పుతున్న కీలక నేత అనుచరులు.. సచివాలయాల్లో కూర్చుని దందా

 తుని పట్టణ లబ్ధిదారులకు భూసమస్యతో ఇన్నాళ్లు పట్టాలివ్వని అధికారులు

 ఎట్టకేలకు 110 ఎకరాలు కొనుగోలు చేసి గత నెలాఖరులో పట్టాలు పంపిణీ

 లబ్ధిదారులకు రూ.7 లక్షల విలువైన స్థలం ఉచితంగా ఇచ్చామంటూ దండుడు

 ఇప్పటికే భూముల కొనుగోళ్లలో నొక్కేసిన కీలక నేత.. ఇప్పుడు అనుచరులు..

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాల పేదల ఇళ్ల స్థలాలు గతేడాది పంచారు. ఈ క్రమంలో ఊరికి దూరంగా ఉన్న భూములను అధికార పార్టీ పెద్దలు కొందరు అధికారులతో కుమ్మక్కై తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆనక రెట్టింపు రేటుకు ప్రభుత్వా నికి అంటగట్టి కోట్లలో సంపాదించారు. అయితే తుని పట్టణ లబ్ధిదారుల విషయానికి వస్తే మున్సిపాల్టీ పరిధిలో స్థలాలు కోట్లలో ఉండడంతో భూముల సేకరణ సాధ్యపడలేదు. దీంతో 4,700 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వలేదు. అయితే జిల్లాలో దాదాపు అందరికీ స్థలాలు ఇవ్వగా తుని పట్టణ లబ్ధిదారులకు స్థలాలు ఇవ్వని నేప థ్యంలో ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో తుని మండలం పరిధిలోని సీతయ్యపేట గ్రామం పరిధిలో 110 ఎకరాలను అధికారులు కొనుగోలు చేశారు. అయితే ఈ కొనుగోలులో భారీ మతలబులు చోటుచేసుకున్నా యి. గత టీడీపీ హయాంలో ఇవే భూములను ఏపీఐఐసీ ఎకరాకు రూ.18 లక్షలకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. తీరా ప్రభుత్వం మారడంతో ఏపీఐఐసీ వెనక్కుతగ్గింది. అయితే ఇప్పుడు అవే భూము లను ఇళ్ల స్థలాల కోసం అధికారులు ఎకరాకు రూ.35 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. తద్వారా కోట్లలో అద నంగా చెల్లింపులు జరిగాయు. కాగా భూములకు అధిక ధర ఇప్పించిన విషయంలో ఇక్కడ కీలక నేతకు ఎకరాకు రూ.5 లక్షల చొప్పున ముడుపులు అందినట్టు తెలుస్తోంది. ఇదిలాఉంటే భూసేకరణ ప్రక్రియ పూర్తవడంతో ఇటీవల 110 ఎకరాలను 4,700 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు వీలుగా లేఅవుట్లుగా అధికారులు విభ జించారు. వీటిని గత నెలాఖరున మంత్రి రాజా చేతుల మీదుగా తుని పట్టణ లబ్ధిదారులకు అందించారు.

అడిగినంత ఇవ్వకపోతే పట్టా రద్దు...

ఒకపక్క 110 ఎకరాల కొనుగోలు కీలక నేత కోట్లు కొట్టేయగా, ఇప్పుడు ఆయన మనుషులు రంగంలోకి దిగారు. కీలక నేత ఆశీస్సులతో లబ్ధిదారుల నుంచి మామూళ్లకు దిగారు. పట్టాలు ఇస్తున్న స్థలం చాలా ఖరీదైందని, ఒక్కో ప్లాటు రూ.7 లక్షల వరకు ఖరీదు చేస్తుందని చెప్పి ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల చొప్పున డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల మంత్రి, కలెక్టర్‌ చేతుల మీదుగా లాంఛనంగా కొందరికే పట్టాలు ఇచ్చారు. దీంతో కీలక నేత అనుచరులు.. పట్టాలు తీసు కున్న, ఇంకా తీసుకోని లబ్ధిదారులకు కబురు పంపి వసూళ్లు మొదలుపెట్టారు. అడిగినంత ఇవ్వ కపోతే పట్టా వేరొకరికి వెళ్లిపోతుందని బెదిరిస్తున్నారు. భూమి ఖరీదైనందున ఎంతైనా ఇవ్వడా నికి అనేకమంది లైన్లో ఉన్నారంటూ బెదిరిస్తున్నారు. దీంతో అనేకమంది లబ్ధిదారులు భయపడి అడిగినంత ఇచ్చుకుంటున్నారు. కొందరు తమ వద్ద అసలు డబ్బుల్లేవని చెప్పినా ఎంతోకొంత ఇవ్వకపోతే సచివాలయ సిబ్బందికి చెప్పి లబ్ధిదారుల జాబితాలో ఏదొక సాకుతో పేరు తీయించే స్తామని హెచ్చరిస్తున్నారు. ఇచ్చిన భూమి అమ్మితే భవిష్యత్తులో రూ.10 లక్షలు వస్తుందని, రూ.50 వేల కోసం పట్టా వదులుకుంటారా అని ఎర వేస్తున్నారు. ఈ జాబితాలో కీలక నేత అను చరులు, కొందరు వైసీపీ కౌన్సిలర్లు కూడా ఉన్నారు. ఇలా 4,700 మంది లబ్ధిదారుల నుంచి రూ.6 కోట్ల వరకు వసూలు చేయడానికి సిద్ధపడ్డారు. ఇప్పటికే అరకోటి వరకు పిండేశారు. ఈ దందా రాత్రివేళల్లో సచివాలయాల వద్ద కీలక నేత అనుచరులు సాగిస్తున్నారు. అనుకూల వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని పక్కన పెట్టుకుని మరీ వసూళ్ల వేట కొనసాగిస్తున్నారు.




Updated Date - 2022-08-10T06:44:16+05:30 IST