భూములు పేదలకే దక్కాలి

ABN , First Publish Date - 2022-05-20T04:54:42+05:30 IST

పేదల భూములు పేదలకే దక్కాలని, కంపెనీలకు కాదని సీపీఎం రాష్ట్ర నాయకుడు భూపాల్‌ పేర్కొన్నారు.

భూములు పేదలకే దక్కాలి
మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర నాయకుడు భూపాల్‌

- సీపీఎం రాష్ట్ర నాయకుడు భూపాల్‌ 

- కంసాన్‌పల్లి భూ సమస్యపై రిలే దీక్ష

దామరగిద్ద, మే 19 : పేదల భూములు పేదలకే దక్కాలని, కంపెనీలకు కాదని సీపీఎం రాష్ట్ర నాయకుడు భూపాల్‌ పేర్కొన్నారు. గురువారం మం డలంలోని కంసాన్‌పల్లి గ్రామం భూసమస్యలో భాగంగా దామరగిద్ద మండల కేంద్రంలో రిలే దీక్షను ప్రారంభించి మాట్లాడారు. కంసాన్‌పల్లి గ్రామం సన్వే నెంబర్‌ 229లో తరతరాలుగా సాగు చేసుకుంటున్న పేదల భూములను ప్రభుత్వం తీసుకోవాలనే ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు. సాగులో ఉన్న ప్రతీ రైతుకు హక్కులు కల్పించాలన్నారు. కంపెనీలకు పేదలు సాగుచేసుకుంటున్న భూములు ఇవ్వడం గొప్పకాదని పెద్దల భూములు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి 200 ఎకరాలకు మా త్రమే యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, అర్హులందరికీ పింఛన్‌ సౌకర్యం, ఉచిత విద్య వంటి హామీలు నెరవేర్చకుండా భూములు సాగుచేసుకొని జీవనం సాగిస్తున్న పేదల భూములను లాక్కోవడం దారుణమన్నా రు. రైతులు దిగులు పడాల్సిన అవసరం లేదని ఎర్ర జెండా అండగా ఉంటుందన్నారు. సాగులో ఉన్న ఒక్క సెంటు భూమిని కూడా రైతులు ఇచ్చేందుకు సిద్ధంగా లేరని, ప్రభుత్వం ఈ విషయాన్ని గమ నించాలన్నారు. సాగులో ఉన్న రైతులందరికీ పాసు బుక్కులు ఇచ్చి రైతు బీమా, రైతుబంధు వర్తింప చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి సాగు చేసుకుంటున్న ప్రతీ ఎకరాకు పట్టాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ఎమ్మెల్యే అయ్యాక భూముల విడచిపెట్టి పోవాలని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు. రైతులంతా ఐక్యంగా ఉండి సమస్యను పరిష్కరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సాగులో ఉన్న ప్రతీ రైతుకు పట్టాపాసు పుస్తకాల అమలుపై ఉన్నతాధికారుల నుంచి హామీ వచ్చే వరకు రిలే దీక్షను కొనసాగిస్తామన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రాణాలను సైతం లేక్కచేయకుండా పోరాటం చేస్తామన్నారు. దీక్షలో భాస్కర్‌, బొగ్గుల నర్సిములు, వడ్డె మల్లేష్‌, శరణప్ప, శ్రీనివాస్‌, వెంకటప్ప, బస్సమ్మ, పార్వతమ్మ, వెంకటప్ప, జములమ్మ కూర్చొన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకుడు వెంకట్రాంరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు గోపాల్‌, రైతు సంఘం జిల్లా నాయ కుడు అంజిలయ్య, జోషి, శివకుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మొగులప్ప పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T04:54:42+05:30 IST