ప్రభుత్వ భూములపై కబ్జాదారుల నజర్‌!

ABN , First Publish Date - 2020-02-20T09:19:03+05:30 IST

ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా భూ ప్రక్షాళన ద్వారా భూముల వివ రాలను పక్కా చేసినా కబ్జాలు మాతరం ఆగ డం లేదు. ప్రభుత్వ భూములు రికార్డుల లొ సుగులతో అన్యక్రాంతం

ప్రభుత్వ భూములపై కబ్జాదారుల నజర్‌!

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్ర జ్యోతి ప్రతినిధి) : ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా భూ ప్రక్షాళన ద్వారా భూముల వివ రాలను పక్కా చేసినా కబ్జాలు మాతరం ఆగ డం లేదు. ప్రభుత్వ భూములు రికార్డుల లొ సుగులతో అన్యక్రాంతం అవుతూనే ఉన్నాయి. కిందిస్థాయిలో సిబ్బంది, కొంతమంది ప్రజాప్ర తినిధులు చేస్తున్నవ్యవహారాలతో దేవాలయ, అటవీ, రెవెన్యూ, సాగునీటి శాఖ, విద్యాశాఖ భూములతో పాటు ఇతర శాఖల భూములు కబ్జాకు గురవుతున్నాయి. పురాతన ఒప్పందా లు, పాత డాక్యుమెంట్ల పేరున రిజిస్ట్రేషన్లు జ రుగుతున్నాయి. భూ ప్రక్షాళన వివరాలను పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్లశాఖ అనుసంధానం కాకపోవడం వల్ల విలువైన భూములు కబ్జా దారుల చేతుల్లోకి పోతున్నాయి. జిల్లాలో భూ ముల ధరలు బాగా పెరిగాయి. పెరిగిన జనా భాకు అవసరాలు పెరగడంతో బీడు భూము లపై అందరి దృష్టి పడుతోంది. ఇండ్ల స్థలా లు, వ్యవసాయ అవసరాల కోసం వాటిని గ త కొన్నేళ్లుగా ఆక్రమించుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణంచేయడంతో పాటు వ్యవసాయం చే స్తున్నారు. గత కొన్నేళ్లుగా కిందిస్థాయిలోని ఉ ద్యోగులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఇ ది కొనసాగుతోంది. ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళనతో ఈ భూముల వివరాలు పక్కా అ యినా ఈ అక్రమాలు ఆగడం లేదు. జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వ అవసరాలకు భూమి దొర కని పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ భూము లు కబ్జా కావడంతో చివరికి వైకుంఠ దామా లకు భూములు దొరకని పరిస్థితి గ్రామాలలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రి తం చేపట్టిన మిషన్‌ కాకతీయ పునరుద్దరణ ద్వారా చెరువు పనులు జరిగాయి. ఈ పనులు చే సేప్పుడే చెరువుల అక్రమాలు బయట పడ్డాయి. శిఖం భూములతో పాటు చెరువులు అన్యక్రాంతం వె లుగులోకి వచ్చాయి. అ ధికారులు చెరువుల చుట్టు బౌండ రీలు వేసినా ఆ భూములపై ఇంకా చర్యలు చేపట్టడం లేదు. కొంతమ ంది కోర్టుకు సైతం వెళ్లడంతో ఆ భూములపై ప్రస్తుతం అధికారులు దృష్టిసారించడం లేదు. ఈ మాత్రం చేపట్టిన సమయంలో ప్రతి చెరువు పరిధిలో ఈ భూ ములు బయటపడ్డాయి. జిల్లాలోని దేవవాల య పరిధిలో విలువైన భూములు ఉన్నాయి. నిజామాబాద్‌ నగరం, శివారులోని దేవాల యాలకు గతంలో భారీగా భూములుఉండేవి. ప్రస్తుతం అవి కనిపించకుండా పోయాయి. నగరంలో ప్రస్తుతం ప్రభుత్వ అవసరాలకు కూడా భూములు దొరకని పరిస్థితి ఉంది. న గర శివారులో ప్రభుత్వ భూములతో పాటు అటవీ భూములు కూడా అన్యక్రాంతం అ య్యాయి. కో-ఆపరేటివ్‌ సంస్థకు చెందిన భూ ములపైన కబ్జాదారుల కన్ను పడింది. కొన్ని భూములలో పెద్దలు ఇళ్లను నిర్మించుకోగా మరికొన్నింటిలో ప్రజాప్రతినిధుల అండతో ప లు సంస్థలు వెలిశాయి. పాత పట్టాలతో రె గ్యులర్‌ కూడా అయ్యాయి. అటవీ భూముల రక్షణ ఇంకా తేలలేదు. ఇదే పరిస్థితి బోధన్‌ చక్కెరఫ్యాక్టరీ భూములపై ఉంది. ఏకంగా ఫ్యాక్టరీ భూమలను కబ్జా చేసేందుకు ప్రయ త్నాలు జరిగాయి. చివరకు వెలుగులోకి రావ డంతో అధికారులపైన వేటు పడింది. జిల్లా పరిధిలోని పలు మండలాలు, గ్రామాల పరి ధిలో ఈ భూముల అక్రమాలు జరిగాయి. అ ధికారులు, ప్రజాప్రతినిధులు అండగా ఉండ టంతో వాటివైపు చూసే వారు లేరు. న గరంలోని బోధన్‌రోడ్డులో ఉన్న ఒక ప్ర భుత్వ కార్యాలయం భూమి కూడా ఆక్ర మణకు ప్రయత్నాలు జరిగాయి. కోర్టు వరకు వెళ్లింది. శాఖ అధికా రులు గట్టిగా ప్రయత్నించడంతో పా టు డాకక్యుమెంట్లనను అందిస్తే తప్ప ఆ భూములు తేలే అవ కాశం లేదు. గతంలో నగరంలోని ఒక దేవాలయం, ఒ క కళాశాల భూములను కూడా కబ్జాకు ప్ర యత్నం చేశారు. పాత పేరున పట్టాలను  సృష్టించారు. రెవెన్యూ అధికారులు అప్రమ త్తం కావడంతో ఆ భూములపై వెనక్కి తగ్గా రు. నగరం పరిధిలో ఒక క్రీడా సంస్థకు కేటా యించిన భూమి కూడా కబ్జాకు గురైంది. చి వరకు ఆ సంస్థ క్రీడా ప్రతినిధులు ఆందోళన చేయడంతో ఆ భూములు అన్యక్రాంత నిలిచి పోయింది. పాత రికార్డులు సక్రమంగా లేకపో వడం, రెవెన్యూ  రికార్డులలలోని లొసుగుల ఆధారంగా ఈ భూములు కబ్జాకు గురవుతు న్నాయి. ఏళ్ల తరబడి కబ్జాల పర్వం కొనసా గుతోంది. గ్రామస్తులు, ఆ పరిసర ప్రాంతా లలోని వారు ధర్నాలు చేస్తే తప్ప ఈ కబ్జా లు ఆగడం లేదు. నగరం పరిధిలనిఇ కొన్ని పార్కు స్థలాలను కూడా ఆక్రమణకు గుర య్యాయి. మున్సిపల్‌ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ కబ్జాలు కొనసాగాయి. 


అధికారులు దృష్టిసారిస్తే..

జిల్లాలోని ఆయా శాఖల భూములపై అధి కారులు దృష్టిసారిస్తే విలువైన భూములు అ న్యక్రాంతం కాకుండా ఉంటే అవకాశం ఉంది. భూ ప్రక్షాళనతో భూముల వివరాలు తెలిసి నందున శాఖల వారిగా వాటి రక్షణకు చర్య లు తీసుకుంటే భవిష్యత్తు అవసరాలకు విని యోగించే అవకాశం ఉంది. గ్రామాలలో పల్లె ప్రగతి పేరున నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ఈ ప్రభుత్వ భూముల రక్షణకు కూడా ప్రత్యేక స్పెషల్‌ డ్రైవ్‌ పెడితే భూములు అన్యక్రాం తం అయ్యే అవకాశం తగ్గనుంది. ప్రభుత్వ అ వసరాలకు ఈ భూములు ఉపయోగపడతాయి. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా త్వర లో చేపట్టే పట్టణ ప్రగతిలో ఈ భూములపై దృష్టి పెడితే మేలు జరుగుతోంది. నిజామా బాద్‌ నగర కార్పొరేషన్‌, బోధన్‌, ఆర్మూర్‌, మున్సిపాలిటీల పరిధిలో విలువైన భూములు ఉన్నాయి. మున్సిపాలిటీల పరిధిలో వార్డులు, డివిజన్ల వారిగా పట్టణ ప్రగతి చేపడుతున్నం దున  ఈభూముల గుర్తింపుపన దృష్టి పెడితే మౌళిక వసతులకు ఈ భూములు ఉపయోగపడే అవకాశం ఉంది. జిల్లాలోని ప్రభుత్వ శాఖల పరిధిలోని భూములను ఆయా శాఖ ల అధికారులు, ఉద్యోగులు దృష్టి పెడితే అన్య క్రాంతం అయ్యే అవకాశం ఉండదని సీనియ ర్‌ అధికారి ఒకరు తెలిపారు. ప్రతిశాఖ తమ పరిధిలోని గ్రామాలు, పట్టణాలలో కార్యాల యాల రికార్డులను సక్రమంగా పరిరక్షిస్తే క బ్జాలకు అవకాశం ఉండదని తెలిపారు. ఒత్తి డిలు, ఇతర భయాల వల్లనే కిందిస్థాయిలో కొంతమంది ఉద్యోగులు కబ్జాలకు అక్కడక్కడ సహకరించే పరిస్థితి ఉందని మరో అధికారి తెలిపారు. ప్రభుత్వ శాఖల అధికారులు ప్ర స్తుతం ఉన్న భూములపై దృష్టి పెడితే స్థలా లు అన్యక్రాంతం కాకుండా మిగిలే అవకాశం ఉంది.

Updated Date - 2020-02-20T09:19:03+05:30 IST