బాదుడుకు రంగంసిద్ధం

ABN , First Publish Date - 2022-08-05T05:42:44+05:30 IST

జిల్లాలో భూముల రిజిసే్ట్రషన్ల విలువ పెంచి బాదుడుకు ప్రభుత్వం సిద్ధమైంది. పరిపాలన వికేంద్రీకరణకే కొత్త జిల్లాల ఏర్పాటు చేశామన్న రాష్ట్ర ప్రభుత్వ అసలు ఎత్తుగడ కాస్త ఆలస్యంగా తెలిసింది.

బాదుడుకు రంగంసిద్ధం

భూముల రిజిస్ట్రేషన్ల విలువ పెంపునకు సన్నాహాలు

రాష్ట్ర, జాతీయ రహదారుల భూ అభివృద్ధిపై దృష్టి

ఆదాయం పెంచుకునేందుకు కొత్త ప్యూహం

ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ 

రిజిస్ట్రేషన శాఖ మౌఖిక ఆదేశాలు


పుట్టపర్తి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూముల రిజిసే్ట్రషన్ల విలువ పెంచి బాదుడుకు ప్రభుత్వం సిద్ధమైంది. పరిపాలన వికేంద్రీకరణకే కొత్త జిల్లాల ఏర్పాటు చేశామన్న రాష్ట్ర ప్రభుత్వ అసలు ఎత్తుగడ కాస్త ఆలస్యంగా తెలిసింది. నూతన జిల్లాల్లో రిజిస్ర్టేషన చార్జీలను ఆదాయం రూపంలో ఆదాయం పెంచుకునేందుకు తాజాగా మరో బాదుడుకు జగన ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలో భూముల రిజిస్ర్టేషన విలువలు పెంపుదలకు స్టాంపులు అండ్‌ రిజిస్ర్టేషన శాఖ సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెలలో జిల్లాలో భూముల విలువలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం భూ అభివృద్ధి మార్కెట్‌ విలువలు పెరిగిన ప్రాంతాలపై దృష్టి సారించారు. ఆయా సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల పరిధిలో ఆరా తీస్తూ అంతర్గతంగా కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భూముల రిజిస్ర్టేషన విలువ పెంపుదలకు ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల కోసం స్టాంపులు, రిజిస్ర్టేషన శాఖ ఎదురు చూస్తున్నట్లు సమాచారం. శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంగా ఏర్పడటంతో ఏప్రిల్‌లో పుట్టపర్తితో పాటు కొత్తచెరువు, బుక్కపట్నంలో స్టాంపులు, రిజిస్ర్టేషన చార్జీలు 50శాతం నుంచి 75 శాతం వరకు ఇప్పటికే పెరిగాయి. వాటితో పాటు విద్యుత, ఆర్టీసీ బస్‌ చార్జీలు, పట్టణాల్లో భవన నిర్మాణాల రిజిస్ర్టేషన విలువను కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి ప్రజలపై పెనుభారాన్ని మోపింది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా రాష్ట్ర, జాతీయ రహదారుల, భూ అభివృద్ధి మార్కెట్‌ విలువలు పెరిగిన చోట రిజిసే్ట్రషన చార్జీలను పెంచేందుకు ప్రభుత్వం గోప్యంగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో ప్రజలపై మరో బాదుడుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది.


చార్జీల పెంపు కోసం పాట్లు

కొత్త జిల్లా కేంద్రం చుట్టూ ఏనుమలపల్లి, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, కప్పలబండ, బీడుపల్లి, కర్ణాటక నాగేపల్లి, బ్రాహ్మణపల్లి మమిళ్లకుంట, కొత్తచెరువు, బుక్కపట్నంతో పాటు సమీపంలోని ప్రాంతాల్లో క్రయవిక్రయాలు మాత్రం జోరు పెరగలేదు. ఇటీవల ప్రభుత్వం నాన లేఅవుట్లల్లో రిజిస్ర్టేషన చేయరాదంటూ నిర్ణయం తీసుకోగా ఆదాయం తగ్గడంతో మళ్లీ వెసులుబాటు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినా లక్ష్యాన్ని చేరుకోలేకపోవడంతో మళ్లీ భూములపై విలువలు పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అదేవిధంగా హిందూపురం, ధర్మవరం, కదిరి, పెనుకొండ, మడకశిరతోపాటు మండల కేంద్రాలు సైతం విస్తరణ దిశగా సాగుతున్నాయి. జిల్లాలో ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం కొత్తరకం ఎత్తుగడ వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా ఆయా ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించి రిజిస్ర్టేషన చార్జీల పెంపుదల జరిగేవి. ఈసారీ రిజిస్ర్టేషన చార్జీల పెంపుదలపై ఇంకా ఓ స్పష్టత రాలేదని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన శాఖ చెబుతోంది. మరో వైపు మాత్రం భూముల రిజిసే్ట్రషన విలువ పెంపుదలకు మాత్రం కసరత్తు చేస్తున్నారు. జిల్లా భూ అభివృద్ధి మార్కెట్‌ విలువపై జిల్లా స్థాయి స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో చర్చించి అమోదం తర్వాత ఏప్రాంతంలో ఎంత రిజిస్ర్టేషన విలువ పెరుగుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రిజిస్ర్టేషన చార్జీలు పెరిగితే భూములతో పాటు స్థలాలు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లతోపాటు భాగస్వామ్య పంపకాలు, తనఖా ఆస్తుల, లేఅవుట్లు భవనాల అభివృద్ధి ఒప్పందాలు ఇలా అన్నింటికీ రిజిస్ర్టేషన చార్జీలు పెరిగే అవకాశం ఉంది.


భూ అభివృద్ధి ప్రాంతాలే టార్గెట్‌

కొత్త జిల్లా ఏర్పాటుతోపాటు తాజాగా గ్రీనఫీల్డ్‌ ఎక్స్‌ప్రె్‌సవే నిర్మాణానికి కేంద్రం గ్రీన సిగ్నల్‌తో జిల్లా గ్రీనఫీల్డ్‌ ఎక్స్‌ప్రె్‌సవే భూములకు తలుపుల నుంచి చిలమత్తూరు వరకు భారీ డిమాండ్‌ వచ్చింది. అదేవిధంగా పుట్టపర్తి-కోడూరు వరకు 12 మీటర్ల వెడల్పుతో రహదారి, గో రంట్ల, హిందూపురం వరకు నాలుగు లేన్ల రహదారి విస్తరణతోపాటు పరిశ్రమల కోసం భూసేకరణతోపాటు అహుడా, ఫుడా పరిధి పెంపుతో భూములు, స్థలాలు, ఇళ్ల ధరలకు రెక్కలొచ్చాయి. స్టాంపులు, రిజిస్ర్టేషన శాఖ మార్కెట్‌ విలువ కంటే బహిరంగ మార్కెట్‌లో పదింతల మేర ధరలు పెరిగాయి. బహిరంగ మా ర్కెట్‌ విలువలపై సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయ పరిధిలో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయం కోసం భూముల విలువను పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇదే జరిగితే కొత్త జిల్లాలో స్థిరాస్తి క్రయవిక్రయాలపై భారం పడే అవకాశలున్నాయి. ఇప్పటికే జిల్లా కేంద్రం పుట్టపర్తి చుట్టూ భూముల ధరలకు రెక్కలొచ్చినా రిజిస్ర్టేషన చార్జీల పెంపుతో జిల్లా కేంద్రంలోని ప్రజలపై భరించలేని భారం పడినట్లయింది.


అధికారిక ఉత్తర్వులు రాలేదు

రిజిస్ట్రేషన చార్జీల పెంపుదలకు సంబంధించి  మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. రాష్ట్రస్థాయి అధికారుల నుంచి ఆదేశాలు రాలేదు. అయితే జిల్లాలో రాష్ట్ర, జాతీయ రహదారులు, భూ అభివృద్ధి మార్కెట్‌ విలువల పెంపుదలపై ఆయా సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం పరిధిలో పెంపుదలకు వెసులుబాటు ఉంటుంది.

కృష్ణకుమారి, జిల్లా రిజిసా్ట్రర్‌, స్టాంపులు, రిజిస్ట్రేషనశాఖ 

Updated Date - 2022-08-05T05:42:44+05:30 IST