కిరాణా కొట్టు నిర్వహకుడికి బ్యాంకు లాకరు..!

ABN , First Publish Date - 2020-10-20T09:57:29+05:30 IST

కిరాణా కొట్టు నిర్వహకుడికి బ్యాంకు లాకరు..!

కిరాణా కొట్టు నిర్వహకుడికి బ్యాంకు లాకరు..!

  • నాగరాజు కేసులో  బినామీని విచారిస్తున్న అధికారులు

హైదరాబాద్‌, తిరుమలగిరి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): భూ వివాదంలో పట్టుబడ్డ కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు మృతి చెందినా.. ఈ కేసు దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు ఏసీబీ అధికారులు ముందుకు సాగుతున్నారు. నాగరాజుకు కీలక బినామీగా ఉన్న అల్వాల్‌కు చెందిన నంద గోపాల్‌, అతని సోదరుడు మహేందర్‌ (ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగి) ఇళ్లలో ఏసీబీ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. కిరాణా కొట్టు నిర్వ హిస్తున్న నందగోపాల్‌కు ఐసీఐసీఐ బ్యాంకులో లాకర్‌ ఉన్నట్లు గుర్తించారు. అయితే.. ఆ లాకర్‌ను నిర్వహించింది మాత్రం నాగరాజు భార్య స్వప్న అని ఏసీబీ అధికారులు నిర్ధారించారు. మహేందర్‌కు ఉన్న లాకర్లను సైతం స్వప్న ఉపయోగించుకునేవారని అధికారులు గుర్తించారు. నందగోపాల్‌ను విచారి స్తున్నారు. లాకరు తాళంచెవి ఎక్కడుందనే ప్రశ్నకు ఆయన సరైన సమాధా నం ఇవ్వలేదు. దీంతో ఒకటి, రెండు రోజుల్లో లాకరు తెరిచేందుకు  అధికారు లు సిద్ధమవుతున్నారు. నందగోపాల్‌, నాగరాజు ఒకే కాలేజీలో చదువుకు న్నారని గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడించారు.

Updated Date - 2020-10-20T09:57:29+05:30 IST