Abn logo
Aug 7 2020 @ 06:06AM

ఇళ్ల స్థలాల కోసం భూముల పరిశీలన

కోరుకొండ, ఆగస్టు 6: కోరుకొండ మండలం గాదరాడ, శ్రీరంగపట్నం గ్రామా ల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అవసరమైన భూములను సేకరించడం కోసం గురువారం సబ్‌కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గాదరాడలో వైసీపీ నాయకులు బత్తుల బలరామకృష్ణ, అడబాల చినబాబుకు సంబంధించిన భూములను పరిశీలించారు. శ్రీరంగపట్నంలో ఇళ్ల స్థలాల కోసం సు మారు ఎనిమిదెకరాల్లో కొండను తవ్వి ఖాళీ చేస్తున్న ప్రదేశాన్ని కూడా పరిశీలించారు. ఇంకా ఏమేరకు అవసరం అవుతాయనే విషయంపై స్థానిక తహశీల్దార్‌ రాజేశ్వరరావుతో చర్చించారు. వారి వెంట ఎంపీడీవో నరేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement