భూ వివాదాల నివారణకే స్వచ్ఛీకరణ

ABN , First Publish Date - 2021-04-17T06:02:21+05:30 IST

గ్రామాల్లో భూముల తగాదాల నివారణకు శాశ్వత భూహక్కు చట్టం, భూరక్ష పథకం ప్రవేశపెట్టిందని, ఇందులో భాగంగా భూ రికార్డుల స్వచ్ఛీకరణ పథకాన్ని వేగవతంగా చేపట్టాలని ఆర్డీవో ఖాజావలి అన్నారు.

భూ వివాదాల నివారణకే స్వచ్ఛీకరణ
శిక్షణా తరగుతిలో మాట్లాడుతున్న ఆర్డీవో ఖాజావలి

తహసీల్దార్లకు శిక్షణ కార్యక్రమంలో ఆర్డీవో ఖాజావలి

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 16 : గ్రామాల్లో భూముల తగాదాల నివారణకు శాశ్వత భూహక్కు చట్టం, భూరక్ష పథకం ప్రవేశపెట్టిందని, ఇందులో భాగంగా భూ రికార్డుల స్వచ్ఛీకరణ పథకాన్ని వేగవతంగా చేపట్టాలని ఆర్డీవో ఖాజావలి అన్నారు. ఎస్వీహెచ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో శుక్రవారం నుంచి తహసీల్దార్లకు, సర్వే బృందాలకు రెండు రోజుల శిక్షణ తరగతులను ఆర్డీవో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడులో రీ సర్వే ప్రాజెక్టును సీఎం ప్రారంభించారన్నారు. ఇప్పుడు దశల వారీగా జిల్లా అంతటా భూ స్వచ్ఛీరణ కార్యక్రమం చేపట్టాలన్నారు. ముడా వీసీ నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి మండలం నుంచి 10 మంది మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. తహసీల్దారు సునీల్‌బాబు మాట్లాడుతూ ప్రతి మండలంలోను మూడు దశల్లో రీసర్వే జరుగుతుందన్నారు . బందరు మండలంలో కెకొత్తపాలెంలో జరిపిన సర్వే వివరాలను తహసీల్దార్‌ వివరించారు. 

Updated Date - 2021-04-17T06:02:21+05:30 IST