మరో బాదుడు

ABN , First Publish Date - 2022-06-02T06:30:14+05:30 IST

పేదలు మొదలుకుని పెద్దల వరకు ఎవ్వరినీ వదలకుండా రాష్ట్ర ప్రభుత్వం మరో బాదుడు బాదేస్తోంది. ఆదాయం పెంచుకునేందుకు భూములు, స్థలాలే కాకుండా భవనాల రిజిస్ట్రేషన విలువను కూడా పెంచేసింది.

మరో బాదుడు

భవనాల రిజిసే్ట్రషన విలువల పెంపు

ప్రజలపై మరింత భారం


ధర్మవరం 

పేదలు మొదలుకుని పెద్దల వరకు ఎవ్వరినీ వదలకుండా రాష్ట్ర ప్రభుత్వం మరో బాదుడు బాదేస్తోంది. ఆదాయం పెంచుకునేందుకు భూములు, స్థలాలే కాకుండా భవనాల రిజిస్ట్రేషన విలువను కూడా పెంచేసింది. ఆదాయం తగ్గిన సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయాలపైనా దృష్టి సారించింది. ఏప్రిల్‌లో 50 శాతం కంటే తక్కువగా లక్ష్యాన్ని చేరిన సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయాలను గుర్తించింది. సదరు సబ్‌ రిజిసా్ట్రర్ల నుంచి ఉన్నతాధికారులు వివరణ కోరినట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ విధానాల కారణంగా రిజిస్ట్రేషన్లు తగ్గాయని కిందిస్థాయి అధికారులు గగ్గోలు పెడుతున్నారు. నాన లేఔట్ల రిజిస్ట్రేషన్లు ఆపేయడం వల్ల కూడా ఆదాయం తగ్గిందని సబ్‌ రిజిసా్ట్రర్లు పేర్కొంటున్నారు. తాజాగా నిర్మాణాలపై రిజిస్ట్రేషన విలువలు పెంచడం మరింత ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపు బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు నగర, పురపాలక, నగర పంచాయతీల్లో సాధారణ భవనాల విలువ చదరపు అడుగుకు రూ.1140 ఉంది. దీనికి 1200కి పెంచారు. గతంలో భవనం ఎన్ని అంతస్తులున్నా ఒకే విలువ ఉండేది. ఇప్పుడు మూడో అంతస్తు నుంచి మరింత పెరగనుంది. సినిమాహాళ్లు, మిల్లులు, ఫ్యాక్టరీలపై ప్రస్తుతం రూ.800 ఉండగా.. ఇక నుంచి రూ.900 పెరగనుంది. కోళ్ల ఫారాల షెడ్లపై ఇప్పటి వరకు రూ.620 ఉండగా ఇకపై రూ.650 కానుంది. సెల్లార్‌, పార్కింగ్‌ ప్రదేశాలు, బహుళ అంతస్థులు, సినిమా థియేటర్లు, వాణిజ్య భవనాలు తదితర అన్ని విలువలు సరాసరి 5శాతం పెరగనున్నాయి.


ఆదాయం పెంచుకునేందుకే..

రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలపై భారం మోపుతూ ఆదాయం పెంచుకునే మార్గాలను వెతుకుతోంది. ఇప్పటికే ఏళ్ల క్రితం నిర్మించుకున్న గృహ నిర్మాణ లబ్ధిదారుల నుంచి ఓటీఎ్‌స పేరుతో రూ.కోట్లలో వసూలు చేస్తోంది. అనుమతి లేకుండా వేసిన లేఔట్ల యజమానుల నుంచి ఓటీఎస్‌ కట్టించుకుంటోంది. విద్యుత, బస్సు చార్జీలనూ పెంచింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా  కొత్తజిల్లాలో భూముల విలువల పెంపు ద్వారా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా పిండేసుకుంటోంది.


గుడిసెనూ వదల్లేదు

వైసీపీ ప్రభుత్వం పూరి గుడిసెను సైతం వదలకుండా రిజిస్ట్రేషన విలువ పెంచింది. గతంలో ప్రభుత్వాలు బడాబాబులు నిర్మించుకునే అపార్ట్‌మెంట్‌పై కన్నేసి, మార్కెట్‌ విలువను పెంచేవి. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం పేదలు నివసించే పూరిగుడిసెలనూ వదలట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో గోడలున్న, పూరిగుడిసెలు, గోడలులేనిపూరి పాకల్ని కూడా వదలడం లేదు. చదరపు అడుగుకు రూ.10 పెంచింది.


పెంచిన ధరలు అమలులోకి వచ్చాయి..

నిర్మాణాలపై ప్రభుత్వం రిజిస్ట్రేషన ధరలను పెంచింది వాస్తవమే. పెంచిన ధరలు అమలులోకి వచ్చాయి.

మాధవి, డీఐజీ, రిజిసే్ట్రషన్ల శాఖ


Updated Date - 2022-06-02T06:30:14+05:30 IST