పారదర్శకంగా భూరికార్డుల ప్రక్షాళన: సబ్‌కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-10-23T05:07:25+05:30 IST

భూ యజమానులకు సమర్థవంతమైన రెవె న్యూ సేవలు అందించడానికి వీలుగా భూ రికార్డుల ప్రక్షాళన, స్వచ్ఛీకరణ సర్వే పారదర్శకంగా నిర్వహించాలని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ ఇలాక్కియా అన్నారు.

పారదర్శకంగా భూరికార్డుల ప్రక్షాళన: సబ్‌కలెక్టర్‌
భూసర్వే ప్రక్రియను తనిఖీ చేస్తున్న సబ్‌కలెక్టర్‌ ఇలాక్కియా

దివాన్‌చెరువు, అక్టోబరు 22: భూ యజమానులకు సమర్థవంతమైన రెవె న్యూ సేవలు అందించడానికి వీలుగా భూ రికార్డుల ప్రక్షాళన, స్వచ్ఛీకరణ సర్వే పారదర్శకంగా నిర్వహించాలని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ ఇలాక్కియా అన్నారు. మండలంలోని జి.ఎర్రంపాలెంలో జరుగుతున్న వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకం సర్వే ప్రక్రియను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. అన్ని అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకున్న తర్వాతే భూ సర్వే నిర్వహించాలని ఆమె అన్నారు. సర్వే పూర్తయిన తర్వాత వివరాల భద్రతకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సర్వే ద్వారా సరిహద్దు వివాదాలు పరిష్కరించి సంబంధిత రికార్డులను అప్‌డేట్‌ చేయడంతోపాటు వాటిని పూర్తిగా స్వచ్ఛీ కరిం చాలని సూచించారు. సర్వే అనంతరం పూర్తి వివరాలు మ్యాపులతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు అందించాలన్నారు. అవినీతికి చోటు లేని విధంగా రైతులకు, భూ యజమానులకు మేలు జరిగేలా సర్వే ఉండాలన్నారు. ఎక్కడా తప్పిదాలు, పొరపాట్లకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ గ్రామం లోని సర్వే ప్రగతిని ఆమె అధికారులతో సమీక్షించారు. సర్వేను వేగవంతంగా నిర్వహించి నిర్ధేశిత లక్ష్యాలను చేరుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జి.బాలసుబ్రహ్మణ్యం, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే యర్‌ గాలిబ్‌సాహెబ్‌, డిప్యూటీ తహశీల్దార్‌ ఎం.పరిమళ, మండల సర్వేయర్‌ రవికాంత్‌, ఆర్‌ఐ జి.రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-23T05:07:25+05:30 IST