పెన్నా పరివాహకంలో మళ్లీ ఆక్రమణలు

ABN , First Publish Date - 2021-05-09T04:50:31+05:30 IST

మండలంలోని పెన్నానది పరివాహక ప్రాంతాలలో వేరుశనగ పంటల కోసం మళ్ళీ ఆక్రమణలు మొదలయ్యాయి. మండలంలోని పుళ్లనీళ్ళపల్లి గ్రామ సమీపంలోని

పెన్నా పరివాహకంలో మళ్లీ ఆక్రమణలు
ఆక్రమిత భూమిని పరిశీలిస్తున్న అధికారులు

చేజర్ల, మే 8: మండలంలోని పెన్నానది పరివాహక ప్రాంతాలలో వేరుశనగ పంటల కోసం మళ్ళీ ఆక్రమణలు మొదలయ్యాయి. మండలంలోని పుళ్లనీళ్ళపల్లి గ్రామ సమీపంలోని పెన్నానది పరివాహక ప్రాంతంలో గత సంవత్సరం తీవ్ర ఉద్రిక్త పరిస్ధితుల మధ్య అధికారులు ఆక్రమించిన స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే కొంతమంది నది పరివాహక ప్రాంతాలలో శనగ పంట సాగు చేసేందుకు సన్నాహమవుతున్నారని, ఈ మేరకు పొలాల్లో విద్యుత్‌ లైన్లు కూడా వేసేశారని ఆర్డీవో, రెవెన్యూ, మీడియాకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకు న్న అధికారులు సంబంధిత రికార్డులను పరిశీలించారు. సర్వే నెం బరు 649లోని పెన్నా పోరంబోకు భూమిలో  5 ఎకరాలు అనధికారికంగా శనగ పంట నాటడంతో పాటు, అక్రమంగా విద్యుత్‌ లైన్లు ఉన్నట్లు గుర్తించినట్లు ఇన్‌చార్జి తహసీల్దారు పి.కిృష్ణ తెలిపారు. వెంటనే విద్యుత్‌ లైన్లు తొలగించేలా సంబంధిత అధికారులకు ఆదేశించా రు. అనధికారికంగా శనగ పంట సాగు చేస్తు న్న వారికి నోటీసులు జారీ చేశారు. మండలంలో సంబంధిత పొలాలను పరిఽశీలించకుండానే విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేసిన వైనంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-05-09T04:50:31+05:30 IST