Advertisement
Advertisement
Abn logo
Advertisement

బంపర్ ఆఫర్.. అక్కడ ఇల్లు కట్టకుంటే ల్యాండ్ ఫ్రీ.. కానీ కొన్ని కండిషన్స్..

ఇంటర్నెట్ డెస్క్: ఆ ప్రాంతంలో జనాభాను పెంచడమే ధ్యేయంగా స్థానిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున ప్రజలు అక్కడకు వచ్చి, స్థిరపడాలనే ఉద్దేశంతో ఇల్లు కట్టుకోవడానికి ఫ్రీ ల్యాండ్‌ను ఆఫర్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో ఆ ప్లాన్ వర్కౌట్ అయింది. ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన వస్తోంది. ప్రభుత్వం చేసిన ప్రకటనపై వందలాది మంది ఆరా తీస్తున్నారు. కాగా.. ఈ ప్రకటన గురించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో జనాభా విపరీతంగా పెరిగి పోతుంటే.. మరికొన్ని దేశాల్లో అందుకు భిన్నంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఆయా దేశ ప్రభుత్వాలు తమ దేశాల్లో జనాభాను పెంచేందకు రకరకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతున్నాయి. ఆస్ట్రేలియాలోని క్విల్పీ నగరానికి చెందిన స్థానిక ప్రభుత్వం కూడా తాజాగా ఇటువంటి నిర్ణయమే తీసుకుంది. నగర పాపులేషన్ ప్రతి ఏడాది పడిపోతుండటంతో.. పెద్ద ఎత్తున ప్రజలు అక్కడకు వచ్చి స్థిరపడాలనే ఉద్దేశంతో ఫ్రీ ల్యాండ్‌ను ఆఫర్ చేస్తూ ప్రటకన విడుదల చేసింది. క్విల్పీలో స్థిరపడాలనుకునేవారికి ఇల్లు నిర్మించుకునేందకు ఫ్రీగా భూమి ఇవ్వనున్నట్టు తన ప్రకటనలో సిటీ కౌన్సిల్ పేర్కొంది. దీంతో ఈ ప్రకటన పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు. 


ఇప్పటి వరకూ 250 మంది ఎక్వైరీ చేసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా భారత్, న్యూజిలాండ్, బ్రిటన్, హాంగ్ కాంగ్ దేశాలకు సంబంధించిన ప్రజలు భారీ మొత్తంలో ఈ ప్రకటన గురించి ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగానే.. ఆస్ట్రేలియా పౌరులకు, పర్మినెంట్ రెసిడెంట్ హోదా కలిగిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. జనాభా కొరత కారణంగా పశుపోషణ, గొర్రెల పెంపకానికి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నందువల్లే ఈ ప్రకటన చేసినట్లు వివరించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం క్విల్పీ‌లో 800 మంది నివసిస్తున్నారు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement