అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్నందుకు బెదిరింపులు

ABN , First Publish Date - 2022-05-25T05:33:21+05:30 IST

అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్నందు కు తప్పుడు కేసులు బనాయిస్తామని బెదురిస్తున్నారని అచ్చు తాపురం గ్రామానికి చెందిన పలువురు మంగళవారం గోకవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అక్రమ మట్టి తవ్వకాలను   అడ్డుకున్నందుకు బెదిరింపులు

పోలీసులకు అచ్చుతాపురం గ్రామస్థుల ఫిర్యాదు 

గోకవరం, మే 24: అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్నందు కు తప్పుడు కేసులు బనాయిస్తామని బెదురిస్తున్నారని అచ్చు తాపురం గ్రామానికి చెందిన పలువురు మంగళవారం గోకవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుల కథనం   ప్ర కారం... మండలంలోని అచ్చుతాపురం గ్రామంలోగల రాజు చెరువు నుంచి గత కొన్ని నెలలుగా ప్రభుత్వ అనుమతి పేరుతో మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పొలంలోకి మట్టిని తీసికెళ్లేందుకు అని అనుమతి తెచ్చి బయట ప్రాంతాలలో ఉన్న ఇటుకబట్టీలకు, నర్సరీలకు మట్టిని అక్రమం గా విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని అనేక మార్లు ఇరిగేషన్‌, రెవెన్యూ  అధికారుల దృష్టికి తీసికెళ్లినా అక్ర మ తవ్వకాలు, అక్రమ మట్టి రవాణా కొన సాగుతూనే ఉంద న్నారు. దీంతో తూర్పుగోదావరిజిల్లా కలెక్టర్‌కు సోమవారం లిఖి త పూర్వకంగా  ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయాన్ని తెలు సుకున్న మట్టి మాఫియా మట్టి తవ్వకం పనులను అ డ్డుకుంటే తప్పుడు కేసులు పెడతామని, ఈ విషయంలో అధి కారులు కూడా తమకే మద్దతు తెలుపుతారని బెదిరింపు లకు దిగుతున్న ట్లు  వారు వివరించారు.  అచ్చుతాపురంలో మట్టి మాఫియా ఆగడాలను అడ్డుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గ్రా మస్ధులు పేర్కొన్నారు. ఫిర్యాదు చేసినవారిలో గ్రామస్థులు నల్లల వెంకన్నబాబు, మద్దా వెంకన్న, చిటికిన సత్య నారాయణ, దాసు, సొంఠి అర్జునుడు తదితరులతోపాటు, శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు ఉన్నారు.


Updated Date - 2022-05-25T05:33:21+05:30 IST