భూ ఆక్రమణలపై విచారణ చేపట్టాలి

ABN , First Publish Date - 2022-05-19T05:49:16+05:30 IST

జిల్లాలో పెద్దఎత్తున భూ అక్రమాలు జరుగుతున్నాయని, వాటిపై వెంటనే విచా రణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు.

భూ ఆక్రమణలపై విచారణ చేపట్టాలి
మాట్లాడుతున్న రాంభూపాల్‌

సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌

అనంతపురం కల్చరల్‌, మే 18: జిల్లాలో పెద్దఎత్తున భూ అక్రమాలు జరుగుతున్నాయని, వాటిపై వెంటనే విచా రణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక గణేనాయక్‌భవనలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు, కొందరు నేతలు కలిసి ప్రభుత్వ భూములను పెద్దఎత్తున కాజేస్తున్నారన్న ఆరోప ణలు వెల్లువెత్తుతున్నాయన్నారు. జిల్లాలో పుట్లూరు, యల్లనూరు, బుక్కరాయసముద్రం, అనంతపురం రూరల్‌, గార్లదిన్నె, శింగనమల ఇలా అనేకచోట్ల భూ అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. పుట్లూరులాంటి మండలాల్లో ఉన్న భూమి కంటే రికార్డుల్లో భూమి ఎక్కువగా ఉందన్న విషయం అధికారుల విచారణలోనే తేలిందని గుర్తుచేశారు. ఈ అక్రమాల్లో రెవెన్యూ అధికారులు భాగస్వాములుగా ఉన్నారని వివరించారు. వీటిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సమగ్రమైన విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. నాలుగు సంవత్సరాల వ్యవధిలో అసైన్డ చేసినట్లు రికార్డుల్లో ఉన్న వివరాలను బహిరంగ పరచాలన్నారు. అలా చేయనిపక్షంలో జూన నెలలో సీపీఎం తరఫున ఈ భూ అక్రమాలను బయటపెట్టి, భూమిలేని పేదలకు పంచిపెడతామని వెల్లడించారు.  కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నాగేంద్రకుమార్‌, సూర్యచంద్ర యాదవ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-19T05:49:16+05:30 IST