బద్వేలులో భూ కబ్జాలు అరికట్టాలి

ABN , First Publish Date - 2022-01-22T05:28:31+05:30 IST

బద్వేలు పట్టణంలో రోజురోజుకు భూ ఆక్రమణలను అరికట్టాలని, కబ్జాలకుపాల్పడే వారిపై చర్యలు చేపట్టి ప్రభుత్వ భూములను కాపాడాలని కేవీపీఎస్‌ రాష్ట్రప్రధాన కార్యదర్శి మాల్యాద్రి డిమాండ్‌ చేశారు.

బద్వేలులో భూ కబ్జాలు అరికట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న మాల్యాద్రి

బద్వేలు, జనవరి 21: బద్వేలు పట్టణంలో రోజురోజుకు  భూ ఆక్రమణలను అరికట్టాలని, కబ్జాలకుపాల్పడే వారిపై చర్యలు చేపట్టి ప్రభుత్వ భూములను కాపాడాలని కేవీపీఎస్‌ రాష్ట్రప్రధాన కార్యదర్శి మాల్యాద్రి డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో కేవీపీఎస్‌ పట్టణ అధ్యక్షుడు గిలకరాజు అ ధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్వేలు ప్రాంతంలో వేలాది ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైందన్నారు. 977/3 సర్వేనంబరులో 2.34 సెంట్లు 1798/250లో 5 ఎకరాలు, ఇలాగే మరికొన్ని వందలాది ఎకరాలు కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోలేనిపక్షంలో ఆందోళన కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆవాజ్‌ జిల్లా అధ్యక్షుడు చాంద్‌బాష, డీవైఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు చిన్ని, రజకసంఘం నాయకుడు నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెంకటేష్‌, రామయ్య, బ్రహ్మయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:28:31+05:30 IST