భూకబ్జా, ఇసుక మాఫియాకు వత్తాసు

ABN , First Publish Date - 2022-09-29T05:01:03+05:30 IST

నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఏమైనా పనికి వచ్చారా? ఆయన వల్ల ఒక్కరికైనా ఉపయోగం ఉందా? భూకబ్జాలు, ఇసుక మాషియాకు వత్తాసు పలకడమే తప్ప ప్రజలకు ఆయన చేసింది ఏం లేదంటూ వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఘాటుగా విమర్శించారు

భూకబ్జా, ఇసుక మాఫియాకు వత్తాసు
నర్సాపూర్‌లో బహిరంగ సభలో మాట్లాడుతున్న వైఎ్‌స షర్మిల

ఇదే నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి చేసే పని

ప్రశ్నించే వారిని బెదిరింపులకు గురిచేస్తారా?

పాదయాత్రలో వైఎస్‌ షర్మిల ధ్వజం


 నర్సాపూర్‌, సెప్టెంబరు 28: నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఏమైనా పనికి వచ్చారా? ఆయన వల్ల ఒక్కరికైనా ఉపయోగం ఉందా? భూకబ్జాలు, ఇసుక మాషియాకు వత్తాసు పలకడమే తప్ప ప్రజలకు ఆయన చేసింది ఏం లేదంటూ వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఘాటుగా విమర్శించారు. పాదయాత్రలో భాగంగా బుధవారం సాయం త్రం నర్సాపూర్‌కు చేరుకున్నారు. అంతకుముందు హత్నూర మండలంలో రాత్రి బస చేసిన తర్వాత బుధవారం ఉదయం నత్నయపల్లి, కాగజ్‌మద్దుర్‌, పెద్దమ్మతండా, నర్సాపూర్‌కు పాదయాత్రగా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామా ల్లో ప్రజలను పలకరించి వారి సమస్యలు అడిగితెలుసుకున్నారు. అనంతరం నర్సాపూర్‌ బస్టాండ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఓ సభలో కల్యాణలక్ష్మి అందడం లేదని ఓ యువకుడు ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని ప్రశ్నిస్తే ఆయన ఆగ్రహంగా ‘‘బట్టేబాజ్‌  లోపల వేయండ్రా’’ అన్నాడటా.. ఎవడు బట్టేబాజ్‌.. పథకాలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది. ఇవ్వకపోతే ప్రశ్నిస్తే ఇష్టానికి మాట్లాడుతురా? అని ఆమె మండిపడ్డారు. మీరు ఎమ్మెల్యే అయితే ప్రశ్నించకూడదా? మీ నెత్తిన ఏమైనా రెండు కొమ్ములు ఉన్నాయా? అంటూ ఘాటుగా ధ్వజమెత్తారు. ఒక్క వాగ్ధానం కూడా నిలబెట్టుకోలేని మిమ్మల్ని ఎన్నిసార్లు లోపల వేయాలని  షర్మిల ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని ప్రశ్నించారు. ఇంకో మహిళ ఇల్లు కావాలి అని అడిగితే ఆమె పైనా కూడా విసుక్కుడంటా.. పైగా ఇళ్లు కట్టించడంలో విఫలమైనట్లు ఒప్పుకున్నాడంటా మరీ  విఫలమైతే ఎందుకు పదవిలో ఉన్నారని షర్మిల ప్రశ్నించారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలో అటవీశాఖ అధికారులు గిరిజనులు సాగుచేసుకుంటున్న భూముల విషయంలో దాడులు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కౌడిపల్లిలో అటవీభూములు కూడా కబ్జాలు చేసి వెంచర్లు వేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాన్ని కూడా డబ్బుతో కొనేశారని, అందుకు కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు నోరు మెదపడం లేదన్నారు. వైఎ్‌సఆర్‌ సంక్షేమపాలన ఇప్పుడు తెలంగాణలో ఎక్కడా లేదన్నారు. వైఎ్‌సఆర్‌ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే పార్టీ పెట్టానని తెలిపారు. ఈ గడ్డకు సేవ చేయడం తన బాఽధ్యత అని ఆమె పేర్కొన్నారు. 


బురదలో.. చెరువులు దాటుతూ..

హత్నూర : వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్థానపాదయాత్ర బుధవారం ఉదయం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రొయ్యపల్లి నుంచి ప్రారంభమైంది. రొయ్యపల్లి శివారులో ఉన్న పోడు భూముల సమస్యలు పరిష్కరించాలంటూ స్థానిక యువకులు షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. శేర్కాన్‌పల్లి నుంచి, పలుగు మీది పోచమ్మ ఆలయం వరకు గుంతలు, బురుదతో కూడిన రోడ్డుపై షర్మిల పాదయాత్ర కొనసాగింది. అదేవిధంగా పలుగు మీది పోచమ్మ ఆలయానికి సమీపంలో శేర్కాన్‌పల్లి-నత్నాయపల్లి రోడ్డుపై చెరువు అలుగు పారుతుండగా... ఆ నీటిని దాటడానికి  అక్కడ, అక్కడ వేసిన బండరాళ్లపై నడుస్తూ వ్యక్తిగత సహాయకుల సహాయంతో అలుగు నీటిని దాటారు. ఆ తర్వాత ఆలయ సమీపంలో షర్మిల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. 

Updated Date - 2022-09-29T05:01:03+05:30 IST