భూకమతాల డిజిటల్ డాక్యుమెంట్లను అధికారులకు అందజేస్తున్న ఎమ్మెల్యే గణేశ్
ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్
నాతవరం: సమగ్ర సర్వేతో భూముల సరిహద్దు సమ స్యలు తొలగిపోయి, రైతుల మధ్య వివాదాలు సమసిపో తాయని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ అన్నారు. మండ లంలోని శృంగవరం గ్రామ సచివాలయంలో మంగళవారం ఆయన రిజిస్ర్టేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, మండలంలోని చొల్లంగిపాలెంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన రీసర్వే పూర్తయ్యిందని, ఆస్తుల క్రయవిక్రయ రిజిస్ర్టేషన్ను శృంగవరంలోనే పూర్తిచేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గోవిందరావు, తహసీల్దార్ జానకమ్మ, ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, వైస్ ఎంపీపీ పైల సునీల్, డీసీసీబీ డైరెక్టర్ అంకంరెడ్డి జమీలు సర్వేయర్ సత్యనారాయణ, శృంగవరం మాజీ సర్పంచ్ ఉలబాల శ్రీనువాసు పాల్గొన్నారు.
ఆరిలోవ రోడ్డు విస్తరణ పనులకు లైన్ క్లియర్
నర్సీపట్నం, జనవరి 18: నర్సీపట్నం- కృష్ణాదేవిపేట మార్గంలోని ఆరిలోవ ఆటవీ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడానికి మార్గం సుగమం అయిందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్గణేశ్ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక మీడియాకు పంపిన వీడియోలో మాట్లాడుతూ, గొలుగొండ మండలం పాకలపాడులోని సర్వే నంబరు 203లో వున్న 5.5 ఎకరాలను అటవీ శాఖకు ఇవ్వడానికి కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. దీంతో ఆరిలోవ అటవీ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు త్వరలో ప్రారంభం అవుతాయని ఆయన చెప్పారు.