Hyderabad: భూ వివాదాలకు కారణమైన ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరణిని అట్టహాసంగా ప్రారంభించిన లక్ష్మాపూర్ గ్రామంలో చాలా భూములు ధరణిలో లేవన్నారు. ఇబ్రహీంపట్నం కాల్పుల ఘటనకు ‘ధరణి’ పోర్టలే కారణమన్నారు.
ప్రభుత్వం భూ కబ్జాలు చేస్తుంది
‘‘రాష్ట్ర ప్రభుత్వం భూ కబ్జాలకు పాల్పడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం దలితులకు, గిరిజనులకు ఇచ్చిన భూమిని టీఆర్ఎస్ లాక్కుంటుంది. హారితహారం పేరు మీద గిరిజనుల భూమిని లాక్కుంటున్నారు. నష్టపరిహారం అడిగిన భూ నిర్వాసితులను అరెస్ట్ చేసి జైళ్లో పెడుతున్నారు. ఫ్యాక్టరీల పేరు మీద నయా భూస్వాములను కేసీఆర్ తయారుచేస్తున్నారు. ఐకియా కంపెనీకి 19 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు కట్టబెట్టారు. ఇప్పటికే కేసీఆర్ కుటుంబం రూ. లక్ష కోట్లు దోచుకుంది. ధరణి పోర్టల్‌కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. మేం ప్రశ్నిస్తున్నందుకే..ధరణిపై కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ధరణి పోర్టల్ భూ సమస్యలకు సంబంధించి లక్షకు పైగా ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి.’’ అని రేవంత్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి