Advertisement
Advertisement
Abn logo
Advertisement

భూ నిర్వాసితులకు పునరావాసం వెంటనే కల్పించాలి

టీజేఎఫ్‌ అధ్యక్షుడు పల్లె రవికుమార్‌ 

మర్రిగూడ, నవంబరు 26: డిండి భూనిర్వాసితులకు ప్రభు త్వం వెంటనే పునరావాసం కల్పించాలని టీజేఎఫ్‌ అధ్యక్షుడు పల్లె రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం రిజర్వాయర్‌లో ముంపునకు గురైన నర్సిరెడ్డిగూడెం గ్రామస్థులు చేపడుతున్న ధర్నాలో ఆయన పాల్గొ ని మద్దతు తెలిపి మాట్లాడారు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులో భా గంగా నిర్మిస్తున్న చర్లగూడెం రిజర్వాయర్‌ కోసం భూనిర్వాసితుల కోసం పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ తక్షణమే అందించి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్నారు. దేవుని మాన్యంలో ఉన్న 50ఎకరాల భూములు న్యాయమైన డిమాండ్‌గా ఇవ్వాలని, దాని తోపాటు రూ.150కోట్ల ప్యాకేజీని భూములు కోల్పోయిన రైతులకు, నిర్వాసితులకు వెంటనే అందజేయాలని ఆయన డిమాండ్‌ చేశా రు. కార్యక్రమంలో నర్సిరెడ్డిగూడెం ముంపు గ్రామ బాధితులు మాదగోని లింగస్వామి, సుంకరి ఇంద్రయ్య, పెరమళ్ల వెంకటయ్య, కాటం జంగయ్య, పెరమళ్ల యేసోబు, కుక్కల వెంకట్‌, బూటం యాదయ్య, మారమ్మ, చంద్రకళ, సుజాత, శ్రీను పాల్గొన్నారు.   


Advertisement
Advertisement