భూవివాదంలో భార్యాభర్తల దారుణ హత్య

ABN , First Publish Date - 2021-05-07T17:43:59+05:30 IST

జిల్లా కేంద్ర కృష్ణగిరిలో భూవివాదంలో భార్యాభర్తలు హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణగిరి వీరప్పనగనర్‌కు చెందిన రాజగోపాలన్‌ కుమారులు ఇళంగోవన్‌(58),

భూవివాదంలో భార్యాభర్తల దారుణ హత్య


కృష్ణగిరి(కర్ణాటక): జిల్లా కేంద్ర కృష్ణగిరిలో భూవివాదంలో భార్యాభర్తలు హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణగిరి వీరప్పనగనర్‌కు చెందిన రాజగోపాలన్‌ కుమారులు ఇళంగోవన్‌(58), పుగళేంది (55), కరికాలన్‌(50). వీరు ముగ్గురు అదే ప్రాంతంలో పక్కపక్కన ఇళ్లల్లోనే నివాసముంటున్నారు. కాగా రాజగోపాలన్‌ గత కొద్ది కాలం క్రితం మృతిచెందాడు. ఆయనకు 3 వేల చదరాల స్థలం ఉంది. గత కొద్ది కాలంగా ఈ స్థల పంపకానికి సంబంధించి అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో బుధవారం రాత్రి 3 కుటుంబాల మధ్య వాదులాట జరిగింది. అయితే స్థానికులు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఇళంగోవన్‌ కుమారుడు లోకేష్‌(19), అతడి స్నేహితుడు కావేరి పట్టణానికి చెందిన సతీష్‌(19) ఇద్దరూ పుగళేంది ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. పుగళేంది తలుపు తీయగానే లోకేష్‌ కత్తితో దాడి చేశారు. గమనించిన పుగళేంది భార్య పప్పిరాణి అడ్డుకోవడంతో ఆమెపై దాడిచేశారు. దీంతో ఇద్దరూ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కాగా వీరి కేకలు విన్న కరికాలన్‌ అతడి భార్య సరస్వతి లోకేష్‌, సతీ్‌షను పట్టుకోబోయారు. దీంతో వారు వీరిపైసైతం దాడిచేసి పారిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన కరికాలన్‌, సరస్వతిలను ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన పుగళేంది, పప్పిరాణి మృతదేహాలను పోస్టుమార్ట నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లోకేష్‌, సతీ్‌షపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా క్రిష్ణగిరి-బెంగళూరు రోడ్డులో రక్తపు మరకలతో ఉన్న చొక్కాలతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని గస్తీ పోలీసులు అడ్డగించి విచారించారు. భూవివాదంలో హత్యకు పాల్పడిన లోకేష్‌, సతీష్ లుగా గుర్తించి వారిని అరెస్టు చేశారు.

Updated Date - 2021-05-07T17:43:59+05:30 IST