అన్నదమ్ముల సమస్యతో కోర్టు కేసులో ఉన్న భూమి దురాక్రమణ

ABN , First Publish Date - 2021-05-11T06:36:17+05:30 IST

అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. అధికార బలం తో ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి

అన్నదమ్ముల సమస్యతో కోర్టు కేసులో ఉన్న భూమి దురాక్రమణ
సర్వే నెంబరు-5లో జరుగుతున్న ఇంటి నిర్మాణం

ఆ భూమిలో ఇటీవల అధికారపార్టీ నాయకుల ఇళ్ల నిర్మాణాలు

అడ్డుకున్న వారిపై దాడి.. బెదిరింపులు

నిర్మాణాలు చేపడుతున్నవారికి ఓ ప్రజాప్రతినిధి సోదరుడి అండ

అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న పోలీసులు


అనంతపురంరూరల్‌, మే 10: అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. అధికార బలం తో ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. భూ యజమానులను కాదని..ఇళ్ల నిర్మాణాలు చేపడతున్నారు. అడ్డు చెప్పిన వారిపై దాడులకు దిగుతూ బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. భూములు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని తెలిసినప్పటికీ ఇంటి నిర్మాణాలు యథేచ్ఛ గా చేపడుతున్నారు. వారికి అధికారపార్టీకి చెంది న ఓ ప్రజాప్రతినిధి సోదరుడి అండ దండలు పుష్కలం గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఆ వ్యక్తులు రె చ్చిపోయి వ్యవహరిస్తున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీసులు కూడా వారికే వంతపాడు తున్నట్టు ఆరోపణలున్నాయి. ఇదీ జిల్లా కేంద్రానికి కూత వేటు దూ రంలోని కక్కలపల్లి కాలనీ గ్రామం పంచాయతీలో జరుగుతున్న వ్యవహారం.  


15ఏళ్లకు పైగా కోర్టు పెండింగ్‌లో భూమి..

మండలంలోని కక్కలపల్లి కాలనీ పంచాయతీ కక్కలపల్లి గ్రామ సర్వేనెంబరు-5లో 10 ఎకరాలకు పైగా భూమి ఉంది. అందులో 5 ఎకరాల భూమిని నగరానికి చెందిన కుమ్మెతి లక్ష్మమ్మ, నారాయణప్ప దంపతులు తాడిప్రతికి చెందిన లక్ష్మిదేవమ్మ, నారాయణస్వామితో 1974లో కొనుగోలు చేశారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కూతు రు ఉన్నారు. అయితే ముగ్గురిలో ఒక వ్యక్తి నకిలీ డాక్యుమెం ట్స్‌ సృష్టించి 1992లో తన కూతురు పేరుమీదుగా రిజిస్టర్‌ చేయించుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆ వ్యక్తి రెవెన్యూశాఖలో పనిచేస్తుండటంతో రికార్డులో సైతం తన కూతురు పేరుమీదుగా భూమిని మార్చుకున్నాడు. ఈక్రమంలోనే కొంత భూమిని ఇతరులకు విక్రయించినట్లు తెలిసింది. ఈవిషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు 2003లో కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. భూమిపైన పర్మనెంట్‌ ఇంజక్షన్‌ ఆర్డర్‌కూడా తీసుకువచ్చారు. ఇంత వరకు బాగా నే ఉన్నా..ప్రస్తుతం ఆ భూమిలో అధికార పార్టీ నాయకు లు దిగారు. దౌర్జన్యంగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఒక నాయకుడు ఏకంగా 5సెంట్లలో ఇంటి నిర్మాణం చేస్తుండగా, మరొకరు రెండు సెంట్లలో ఇల్లు నిర్మిస్తున్నా రు. విషయం తెలుసుకుని ఇటీవల అడ్డుకునేందుకు వెళ్లి న వారిని బెదించడంతో పాటు దాడికి కూడా తెగబడ్డారు. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయిస్తే వారు కూడా నిందితులకే వత్తాసు పలికినట్లు సమాచారం. 


అండగా ఓ ప్రజాప్రతినిధి సోదరుడు

ఆ భూమిలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తులకు అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సోదరుడి అండ దండలు పుష్కలంగా ఉన్నట్లు తెలిసింది. ఈక్రమంలోనే వారు భూమి కోర్టు కేసులో ఉందని చెప్పిన లెక్కచేయకుండా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. సాధారణంగా ఇంటి నిర్మాణాలు చేపట్టాలంటే పంచాయతీ, అహుడా అనుమతులు ఉండాలి. ఈ అనుమతులను సైతం ప్రజాప్రతినిధి సోదరుడే ఇప్పించినట్లు తెలిసింది. గతంలోను స్థానికంగా ఓ వెంచర్‌ యజ మాని అపార్ట్‌మెంట్‌ నిర్మించేందుకు యత్నించాడు.  అధికార పార్టీ ప్రజాప్రతినిధులచేతుల మీదు గా బ్రోచర్లు ఆవిష్కరించారు. అయితే ఆ ప్రజాప్రతినిధి సోదరుడు అడ్డుకోవడంతో అది ఆగిపోయిందన్న వాదనలున్నాయి. ఇలా అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా ఇతరుల కు సంబంధించిన భూముల్లో కలుగజేసుకుని బెదిరింపులు..దాడులకు దిగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.


Updated Date - 2021-05-11T06:36:17+05:30 IST