కాలువల అనుసంధానానికి భూసేకరణ

ABN , First Publish Date - 2022-08-17T04:46:26+05:30 IST

మండలంలోని పులికల్లు, కంసలవాం డ్లపల్లె, మడుమూరు గ్రామాల పరిధిలో ఎచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పైపులైన్‌ అనుసంధానం కోసం 49 మంది రైతులకు సం బందించి 22.64 ఎకరాల భూమిని సేకరించి నట్లు మదనపల్లె ఆర్డీవో మురళి తెలిపారు.

కాలువల అనుసంధానానికి భూసేకరణ
సమావేశంలో మాట్లాడుతున్న మదనపల్లె ఆర్డీవో మురళి

మడుమూరు, కంసలవాండ్లపల్లె, పులికల్లు  గ్రామాల్లో 22.64 ఎకరాల భూమి సేకరణ   ఎకరానికి 6లక్షల పరిహారం

 మూడు గ్రామాలకు చెందిన 49 మంది రైతులకు పరిహారం రైతుల సమావేశంలో మదనపల్లె ఆర్డీవో మురళి  వెల్లడి

పెద్దతిప్పసముద్రం ఆగస్టు 16 : మండలంలోని పులికల్లు, కంసలవాం డ్లపల్లె, మడుమూరు గ్రామాల పరిధిలో ఎచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పైపులైన్‌ అనుసంధానం కోసం 49 మంది రైతులకు సం బందించి 22.64 ఎకరాల భూమిని సేకరించి నట్లు  మదనపల్లె ఆర్డీవో మురళి తెలిపారు. గండికోట రిజర్వాయర్‌ నుంచి హంద్రీ-నీవా కాలువ ద్వారా అనుసంధానం చేసి పడమటి మండలాల రైతులకు నీటిని అందించడం కోసం భూములు భూ సేకరణ చేసినట్లు పేర్కొన్నారు. భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి 6 లక్షల రూపాయల చొప్పున పరి హారం అందించడం జరుగు తుందని ఆర్డీవో వెల్లడించారు. మంగళవారం మడుమూరులో భూనిర్వాసితులతో  ఆయన గ్రామసభ నిర్వ హించి  మాట్లాడుతూ మడు మూరు గ్రామం లో 10.72 ఎకరాలు, కంసలవాండ్లపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో 6.64 ఎకరాలు, పులికల్లు గ్రామ పంచాయతీ పరిధి లో 5.28 ఎకరాలను పైపులైన్‌  కోసం భూమిని సేకరించినట్లు తెలి పారు. ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు సహక రించి ఒప్పంద పత్రాలపై సంతా కాలు చే యాలని రైతులను కోరారు. ఈ భూములలో బోర్లు, చెట్లు, కట్టడాలు ఉంటే వాటికి అదనం గా పరిహారం అందుతుందన్నారు.  గ్రామ సభ లో రైతుల ఆమోదాన్ని రెవెన్యూ అధికారులు ఒప్పంద పత్రాల పై సంతాకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్‌చార్జ్‌ తహసీ ల్దార్‌ విద్యాసాగర్‌, హంద్రీ-నీవా యూనిట్‌ కార్యాలయ సిబ్బంది రాజేష్‌కుమార్‌, డీటీలు సుబ్బయ్య, పద్మనాభం, వీఆర్వోలు మల్లిఖా ర్జున, సలీంబాషలతో పాటు రెవెన్యూ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-17T04:46:26+05:30 IST