పట్టాల పంపిణీ తుదిదశకు..

ABN , First Publish Date - 2021-01-16T05:33:49+05:30 IST

జిల్లాలో పేదలం దరికి ఇళ్ల పథకం కింద నివేశన స్థలాలు, గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఏపీ టిడ్కో ఇళ్ల పంపిణీ చివరి దశకు చేరుకొంది.

పట్టాల పంపిణీ తుదిదశకు..

2.34 లక్షల మందికి పట్టాల పంపిణీ పూర్తి

మిగతా 51 వేల మందికి రెండ్రోజుల్లో..


గుంటూరు, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పేదలం దరికి ఇళ్ల పథకం కింద నివేశన స్థలాలు, గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఏపీ టిడ్కో ఇళ్ల పంపిణీ చివరి దశకు చేరుకొంది. వారం ఆలస్యమైనప్పటికీ ఇప్పటికే రెండు లక్షల పైచిలుకు మందికి ఇళ్ల పట్టాలను అందజే శారు. నిత్యం సచి వాలయాల వారీగా లబ్ధిదారులను లేఅవుట్ల వద్దకు తీసుకెళ్లి పట్టాలు ఇస్తున్నారు. వారికి ఇచ్చిన ప్లాట్‌ లో ఫోటో తీసి జియో ట్యాగింగ్‌ చేయడంలో కొంత జాప్యం జరుగుతోంది. ఇంకా 51 వేల మందికి పట్టాలను పంపిణీ చేయాల్సి ఉండటంతో సంక్రాంతి పండగ లోపే పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు వరుస సెలవు దినాలు రావడంతో పంపిణీ పూర్తి కావడానికి మరో వారం రోజులు పట్టే అవకాశా లున్నాయి.  పేదలందరికి ఇళ్ల పథకం కింద జిల్లాలో 2,84,365 మందికి నివేశన స్థలాలు మంజూరయ్యాయి. గుంటూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 1,09,990, తెనాలి డివిజన్‌లో 82,631, నరసరావుపేట డివిజన్‌లో 54,528, గురజాల డివిజన్‌లో 37,216 మంది లబ్ధిదారులుగా ఎంపిక య్యారు. అయితే ఇప్పటివరకు గుంటూరు డివిజన్‌లో 70,325, తెనాలి డివిజన్‌లో 62,346, నరసరావుపేట డివి జన్‌లో 38,294, గురజాల డివిజన్‌లో 31,490 మందికి ఇళ్ల పట్టాల ను పంపిణీ చేసినట్లు అధికారవర్గాలు చెబుతు న్నాయి. ఏపీ టిడ్కో హౌసింగ్‌ ఫ్లాట్లకు సంబంధించి 12,594 మంది కి పంపిణీ చేశారు. ఈ విధంగా ఇప్పటివరకు 2,34,315 మందికి పట్టాల పంపిణీ పూర్తి అయింది. ఇంకా 50,020 మందికి పట్టాలను పంపిణీ చేయాలి. మొత్తం లేఅవుట్ల సంఖ్య 1,340 కాగా ఇప్పటి వరకు 1,086 లేఅవుట్ల లో పట్టాల పంపిణీ ముగిసింది.

     ఇదిలావుంటే జిల్లాలో కోర్టు కేసులు కారణంగా ఇంచు మించు 20 వేల మందికి ప ట్టాల పంపిణీ నిలిచిపో యిం ది. అవి ఎప్పటికి పరిష్కారం అవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో సంబంధిత లబ్ధిదారులు అసంతృప్తికి గురౌతున్నారు. కోర్టు కేసు పరిష్కారం కోసం చూడ కుండా వేరొక చోట భూమిని సేకరించి తమకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయా లని కోరుతున్నారు. గుంటూ రు రెవెన్యూ డివిజన్‌లో దాదాపుగా 39 వేల మందికి ఇంకా ఇళ్ల పట్టాల పంపిణీ జరగాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించకపోతే మరింత జాప్యం జరిగే అవకాశం లేకపోలేదు.  

Updated Date - 2021-01-16T05:33:49+05:30 IST