కరోనా విషయంలో తప్పుడు ఆశావాదం వద్దు, భారత్‌కు లాన్సెట్ సూచన

ABN , First Publish Date - 2020-09-26T21:42:42+05:30 IST

కరోనా వ్యాప్తి విషయంలో అంతా సవ్యంగా ఉందనే కథనాల కారణంగా తప్పుడు ధీమా పెరగకుండా చూసుకోవాలని ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ భారత్‌కు సూచించింది. ఇలాంటి తప్పుడు సానుకూల వైఖరితో వాస్తవ పరిస్థితి గుర్తించలేని పరిస్థితి నెలకొనవచ్చని వ్యాఖ్యానించింది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలకు కూడా ఈ వైఖరి అడ్డంకిగా మారొచ్చని అభిప్రాయపడింది.

కరోనా విషయంలో తప్పుడు ఆశావాదం వద్దు, భారత్‌కు లాన్సెట్ సూచన

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి విషయంలో సానుకూల కథనాల కారణంగా తప్పుడు ధీమా పెరగకుండా చూసుకోవాలని ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ భారత్‌కు సూచించింది. ఇలాంటి తప్పుడు సానుకూల వైఖరితో వాస్తవ పరిస్థితి గుర్తించలేని పరిస్థితి నెలకొనవచ్చని వ్యాఖ్యానించింది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలకు కూడా ఈ వైఖరి అడ్డంకిగా మారొచ్చని అభిప్రాయపడింది.

‘వైద్య రంగంలో భారత్‌కు ఉన్న శక్తి సామర్థ్యాలు అధికమే. అయితే వీటిని సద్వినియోగం చేసుకునేందుకు భారత రాజకీయ నేతలు శాస్త్రీయమైన ఆధారాలను, నిపుణులు సూచనలను పరిగణలోకి తీసుకోవాలి. అనవసర ఆశావాదానికి తావివ్వకూడదు’ అని పేర్కొంది.

అయితే కరోనా సమయంలో సాధించిన విజయాలను గుర్తించడం మాత్రం అవసరమేనని వ్యాఖ్యానించింది. ‘ఓపైపు కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షల సడలింపు.. తప్పుడు ఆశావాద వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ కారణంగా మాస్కుల వినియోగం, భౌతిక దూరం నియమాలు పాటించడం తగ్గే ప్రమాదం ఉంది’ అని అభిప్రాయపడింది.

ఐసీఎమ్ఆర్ ప్రస్తావన తెచ్చిన లాన్సెట్..
ఆగస్టు 15 నాటికే కరోనా టీకాను అందుబాటులోకి రావచ్చంటూ భారత్ వైద్య పరిశోధన మండలి గతంలో ఇచ్చిన ప్రకటనను కూడా ల్యాన్సెట్ ప్రస్తావించింది. ఈ డెడ్‌లైన్ ఆచరణ సాధ్యం కాదంటూ నిపుణుల వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఊటంకించింది. శాస్త్రీయపరమైన పూర్తి ఆధారాలు లేకుండానే హెచ్‌సీక్యూ ట్రీట్‌మెంట్‌కు ఐసీఎమ్ఆర్ మద్దతు తెలపడాన్ని కూడా ల్యాన్సెట్ తన వ్యాసంలో పేర్కొంది.

ఇక భారత్ పేర్కొంటున్న అధికారిక కరోనా మరణాల రేటు విషయంలోనూ పలు ప్రశ్నలు సంధించింది. ఇక్కడ కరోనా మరణాల రేటు 1.8 శాతంగా ఉందని, ఇది ఇతర దేశాల కంటే తక్కువని చెప్పిన ల్యాన్సెట్.. ఈ గణంకాలను ఒకదానితో మరొకటి పోల్చవచ్చో లేదో కచ్చితంగా చెప్పడం కష్టమని కూడా వ్యాఖ్యానించింది.  
  

Updated Date - 2020-09-26T21:42:42+05:30 IST