లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి

ABN , First Publish Date - 2022-10-08T03:54:53+05:30 IST

లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని శుక్రవారం తుడుందెబ్బ నాయకులు డీటీ సంతోష్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి
వినతిపత్రం అందజేస్తున్న తుడుందెబ్బ నాయకులు

వాంకిడి, అక్టోబరు 7: లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని శుక్రవారం తుడుందెబ్బ నాయకులు డీటీ సంతోష్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ జిల్లాఅధ్యక్షుడు కోట్నకవిజయ్‌ మాట్లాడుతూ ఇతరప్రాంతాల నుంచి వలసవచ్చిన లంబాడాలకు తహసీల్దార్‌ కార్యాల యాల్లో ఎస్టీ ధ్రువపత్రాలు అందించకుండా నిలిపివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మండల సర్పంచులు సిడాం అన్నిగ, దేవరావు, కోట్నక కిష్టు, సాగర్‌, జైరాం, తుడుందెబ్బ నాయకులు సాయినాథ్‌, రాంషావు, అవిరాష్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు): మండలకేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం లాంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తహసీల్దార్‌ మెస్రం నాగోరావుకు ఆదివాసీసంఘాల నాయకులు వినతిపత్రం అందించారు. తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్రం కభీర్‌దాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T03:54:53+05:30 IST