గొర్రె పురాణం

ABN , First Publish Date - 2021-03-01T06:37:15+05:30 IST

కాలం వల విసిరితే వెన్నెముక లేని గొర్రెలు అగ్గువకే అమ్ముడుబోతున్నయ్‌...

గొర్రె పురాణం

కాలం వల విసిరితే

వెన్నెముక లేని గొర్రెలు

అగ్గువకే అమ్ముడుబోతున్నయ్‌


అందనిదేదో అందుకుంటున్నం

అందరితోటి ముందరుంటన్నం

ఇంకేం కావాలని

గొర్రెలు బొర్రలు విరుస్తున్నయ్‌


గొర్రెనుక గొర్రె

బాయిల పడుతున్నయ్‌

అది చూసిన

చూపుడేలు పెద్దమనిషి

నాలుగు బాటలకాడ

ఒక్కడే బెంగటిల్లుతున్నడు

బతుకనేర్చిన గొర్రెలను చూసి

కుమిలి కుమిలి ఏడుస్తున్నడు

సిగ్గులేని గొర్రెలు

సిల్లర మల్లర గొర్రెలు

నవ్వుకోండ్రి మాకేందని


నడిబజార్ల

రంగు రంగుల

కండువాలు కప్పుకుంటున్నయ్‌

వయ్యారి నాట్యమాడుతున్నయ్‌


గొర్రెది గొర్రె బుద్ధే

అదెప్పుడు అంతే....

కసాయినే కౌగిలించుకుంటది

భూమ్మీద నూకలు చెల్లిపోయేదాకా

గొర్రెది బాయిబొంద పోకడే!!


పసునూరి రవీందర్‌ 

77026 48825


Updated Date - 2021-03-01T06:37:15+05:30 IST