జంతుగణన ఉన్నప్పుడు కులాలవారీ ఉంటే తప్పేంటి?

ABN , First Publish Date - 2021-08-13T20:15:36+05:30 IST

కులాలవారీ జనాభా లెక్కల సేకరణకు ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్ డిమాండ్ చేసారు. వెనుకబడిన, మరింత వెనుక బడిన కులాల ..

జంతుగణన ఉన్నప్పుడు కులాలవారీ ఉంటే తప్పేంటి?

న్యూఢిల్లీ: కులాలవారీ జనాభా లెక్కల సేకరణకు ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్ డిమాండ్ చేసారు. వెనుకబడిన, మరింత వెనుక బడిన కులాల వారి జీవితాలను మెరుగుపరచేందుకు కులాలవారీ లెక్కలు అవసరమని అన్నారు. జంతువుల లెక్కలు వేస్తున్నప్పుడు కులాల వారీగా జనాభా లెక్కింపు ఎందుకు జరపకూడదు? అని లాలూ ప్రశ్నించారు.


''జంతువులు, పక్షలు, ఇతర జాతుల లెక్కింపు జరుపుతున్నాం. కానీ, వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వారి అభ్యున్నతి కోసం జనాభా లెక్కలు జరపడం లేదు. ప్రజల అభ్యున్నతే జనగణన ప్రధాన ఉద్దేశం అయితే, వేలాది కులాల లెక్కింపు ఎందుకు తప్పవుతుంది? ఆయా తరగతుల అభ్యున్నత జరగాలని మాట్లాడితే తప్పేమిటి?'' అని లాలూ ఓ ట్వీట్‌లో ప్రశ్నించారు. కుల ఆధారిత జనాభా లెక్కల అంశంపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చ జరిగింది. కొందరు బీజేపీ భాగస్వామ్య పార్టీల ఎంపీలతో పాటు పలు విపక్ష పార్టీలు కులాలవారీ జనగణనకు డిమాండ్ చేశారు. కుల గణాంకాలను విడుదల చేసే ఆలోచన ఏదీ లేదని గత మార్చిలో హోం మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. 

Updated Date - 2021-08-13T20:15:36+05:30 IST