Abn logo
Sep 19 2021 @ 00:24AM

పార్కును మహిళల వాకింగ్‌ ట్రాక్‌గా మార్చాలి

అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న నసీర్‌ తదితరులు

గుంటూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): స్థానిక జనాబ్‌ ఎస్‌ఎస్‌ లాల్‌జాన మెమోరియల్‌ చిల్డ్రన పార్కును మహిళా వాకింగ్‌ ట్రాక్‌గా మార్చాలని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇనచార్జి మహ్మద్‌ నసీర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన  పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పొన్నూరు రోడ్డులో ఉంటున్న ముస్లీం మహిళలు నడక కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ దృష్ట్యా లాల్‌జాన పార్కులో మహిళలకు ప్రత్యేక ట్రాక్‌ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఖుద్దూస్‌, హాఫీజ్‌, ఇక్బాల్‌, హాజీ హసనబాషా, వేములకొండ శ్రీనివాస్‌, జమీర్‌, అన్వర్‌ తదితరులు పాల్గొన్నారు.