న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్(Telangana bhavan)లో లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు (Bonalu) వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy) అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ... వచ్చే ఏడాది నుంచి ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలకు కేంద్ర టూరిజం శాఖ తరపున నిధులు కేటాయిస్తామన్నారు. ఢిల్లీలో మరింత వైభవంగా బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. లాల్‌దర్వాజ బోనాల కమిటీ ఇతర దేవాలయాలను కలుపుకొని ఉత్సవాలు నిర్వహించాలన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ, హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు జరుగుతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి