లాలాపేట స్టేడియం.. నిరాశ్రయులకు శరణాలయం..

ABN , First Publish Date - 2020-04-10T20:31:34+05:30 IST

సాధారణ రోజుల్లో లాలాపేట స్టేడియం క్రీడాకారులతో కళకళలాడే ఆటస్థలం.. ఇప్పుడు..

లాలాపేట స్టేడియం.. నిరాశ్రయులకు శరణాలయం..

హైదరాబాద్: సాధారణ రోజుల్లో లాలాపేట స్టేడియం క్రీడాకారులతో కళకళలాడే ఆటస్థలం.. ఇప్పుడు ఎందరో వలస కార్మికులు, కూలీలు, నిరాశ్రయులకు తాత్కాలిక శరణాలయమైంది. కరోనా వైరస్ విజృంభనకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో అన్నిరకాల కార్యకలాపాలకు బ్రేక్ పడింది. హైదరాబాద్‌లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కనీస వ్యవధి లేకుండా లాక్ డౌన్ ప్రకటించడంతో పేదలు, కూలీలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పరిశ్రమలు మూతపడడంతో వలస కార్మికులు రోడ్డునపడ్డారు. దీంతో అధికారులు వారందరినీ లాలాపేట స్టేడియానికి తరలించారు. ప్రస్తుతం ఇక్కడ 250 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారు. స్త్రీ, పురుషులు, చిన్నపిల్లలు ఉన్నారు. వారి బాగోగులు చూడడంలో అమన్ వేదిక నిర్వాహకులతో పాటు జీహెచ్ఎంసీ, నార్త్ జోన్ జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు. వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ.. సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. 


Updated Date - 2020-04-10T20:31:34+05:30 IST