JDU నూతన అధ్యక్షుడిగా లలన్ సింగ్

ABN , First Publish Date - 2021-07-31T23:34:53+05:30 IST

జేడీయూ నూతన అధ్యక్షుడిగా రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ ఎన్నికయ్యారు. గతంలో

JDU నూతన అధ్యక్షుడిగా లలన్ సింగ్

పాట్నా : జేడీయూ నూతన అధ్యక్షుడిగా రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ ఎన్నికయ్యారు. గతంలో జేడీయూ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ ఆర్సీపీ సింగ్ బాధ్యతలు నిర్వర్తించేవారు. అయితే తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆర్సీపీ సింగ్‌కు చోటు దక్కింది. దీంతో జేడీయూ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో శనివారం జేడీయూ జాతీయ కార్యవర్గం సమావేశమైంది. సీఎం నితీశ్ కుమార్ దీనికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలోనే జేడీయూ నూతన అధ్యక్షుడిగా లలన్ సింగ్‌ ఎన్నికయ్యారు.

నితీశ్‌కు చాలా సన్నిహితుడిగా పేరు

రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ సీఎం నితీశ్‌కు చాలా సన్నిహితుడు. కర్పూరీ ఠాకూర్ శిష్యుడు. 1970 నుంచి సీఎం నితీశ్‌కు సన్నిహితుడిగా మెలుగుతున్నారు. ముంగేర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. శరద్ యాదవ్, నితీశ్ మధ్య అభిప్రాయాలు వచ్చిన సమయంలో లలన్ సింగ్ నితీశ్‌కు మద్దతుగా నిలిచారు. నితీశ్ కుమార్ ఇబ్బందుల్లో పడ్డప్పుడల్లా, లలన్ సింగ్ ‘సంకట మోచన్’ అవతారమెత్తి, నితీశ్‌కు తగిన సలహాలు కూడా ఇచ్చారు. 

Updated Date - 2021-07-31T23:34:53+05:30 IST