Sep 18 2021 @ 12:09PM

'లాల్ సింగ్ చద్దా': షూటింగ్ కంప్లీట్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం 'లాల్ సింగ్ చద్దా'. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ఆమిర్ సరసన కరీనా కపూర్ నటిస్తోంది. ఈ సినిమాలో సైనికుడిగా కనిపించడానికి చైతు తన లుక్‌ను మార్చుకొని సరికొత్త మేక్ ఓవర్‌తో రాబోతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసినట్టుగా చిత్రబృందం తెలిపింది. ఈ మేరకు టీం అంతా కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా 'లాల్ సింగ్ చద్దా' ఈ ఏడాది డిసెంబర్ 24న  విడుదల కానుంది. ఈ మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్య ఏమేరకు ఆకట్టుకుంటారో చూడాలి.  

Bollywoodమరిన్ని...