లక్ష్మీనృసింహుడికి రూ.84.18లక్షల ఆదాయం

ABN , First Publish Date - 2021-07-28T06:31:03+05:30 IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 20 రోజుల్లో రూ.84.18లక్షల ఆదాయం భక్తుల నుంచి సమకూరింది. నృసింహుడిని దర్శించుకున్న భక్తులు హుండీల్లో సమర్పించిన నగదు, నగలను కొండపై ఉన్న హరిత కాటేజ్‌లోని సమావేశ మందిరంలో సిబ్బంది మంగళవారం లెక్కించారు.

లక్ష్మీనృసింహుడికి రూ.84.18లక్షల ఆదాయం
స్వామివారి హుండీ ఆదాయం లెక్కిస్తున్న దేవస్థాన సిబ్బంది

యాదాద్రి టౌన్‌, జూలై 27: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 20 రోజుల్లో రూ.84.18లక్షల ఆదాయం భక్తుల నుంచి సమకూరింది. నృసింహుడిని దర్శించుకున్న భక్తులు హుండీల్లో సమర్పించిన నగదు, నగలను కొండపై ఉన్న హరిత కాటేజ్‌లోని సమావేశ మందిరంలో సిబ్బంది మంగళవారం లెక్కించారు. రూ.84.18లక్షల నగదు, 50 గ్రాముల మిశ్రమ బంగారం, 4.5 కిలోల మిశ్రమ వెండిని దేవస్థాన ఖజానాలో జమ చేశామని యాదాద్రి ఆల య కార్యనిర్వహణాధికారి గీతారెడ్డి తెలిపారు. హుండీల లెక్కింపును ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి పర్యవేక్షించారు.


క్షేత్రపాలకుడికి వైభవంగా నాగవల్లి దళార్చన

యాదాద్రీశుడి సన్నిధిలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం నాగవళ్లి దళార్చన వైభవంగా నిర్వహించారు. కొండపైన విష్ణు పుష్కరిణి చెం త, పాతగుట్ట ఆలయంల్లో కొలువైన ఆంజనేయ స్వామికి వేదమంత్రాల నడు మ పంచామృతాభిషేకం నిర్వహించారు. సింధూరం వివిధ రకాల పూలమాల లో అలంకరించి సహస్రనామ పఠనాలతో నాగవల్లి దళార్చన నిర్వహించారు. బాలాలయంలో ఉత్సవమూర్తులకు అభిషేకం, అర్చనలు, హోమం, నిత్యతిరుకల్యాణోత్సవం శాస్త్రోక్తంగా కొనసాగాయి. కాగా, స్వామి వారికి మంగళవారం వివిధ విభాగాల ద్వారా రూ.5,29,006 ఆదాయం సమకూరింది.

Updated Date - 2021-07-28T06:31:03+05:30 IST