Lakshmi Parvathi గురించి అయితే నాకు ఫోన్ చేయొద్దు.. అంబటి అవహేళన

ABN , First Publish Date - 2021-07-21T20:11:10+05:30 IST

వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతికి చెందిన పొలం వివాదంలో చిక్కుకుంది. సత్తెనపల్లి మండలం దూళిపాళ్లలో లక్ష్మీ పార్వతికి రెండున్నర ఎకరాల పొలం ఉంది.

Lakshmi Parvathi గురించి అయితే నాకు ఫోన్ చేయొద్దు.. అంబటి అవహేళన

గుంటూరు: వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతికి చెందిన పొలం వివాదంలో చిక్కుకుంది. సత్తెనపల్లి మండలం దూళిపాళ్లలో లక్ష్మీ పార్వతికి రెండున్నర ఎకరాల పొలం ఉంది. దీని పర్యవేక్షణ బాధ్యతలను సత్తెనపల్లి బీజేపి మండల అధ్యక్షుడు కోటేశ్వరరావుకు అప్పగించారు. ఇదిలా ఉంటే, జలకళ పథకంలో భాగంగా తన పొలంలో బోరు వేయించాలని కోటేశ్వర రావుకు ఆమె సూచించారు. దీనిపై ఎమ్మెల్యే అంబటి రాంబాబును కలవాలని కూడా చెప్పారు. అయితే బోరు వేయనీకుండా స్థానిక నేతలు అడ్డుపడటంతో వివాదం నెలకొంది. స్థానిక నేతల వ్యవహార శైలిపై అంబటికి బీజేపీ నేత ఫోన్ చేశారు. అయితే లక్ష్మీ పార్వతి పొలం గురించి తనకు ఫోన్ చేయొద్దని అంబటి చెప్పడంతో ఆయన షాక్ అయ్యారు. దీంతో గవర్నర్, సీఎం జగన్‌కు ఫిర్యాదు చేస్తానని అంబటితో అనగా... వాళ్లకే కాదు ప్రధాని, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసుకో అంటూ అవహేళన చేశారని సదరు బీజేపీ నేత కోటేశ్వర రావు వాపోయారు. అంబటి రాంబాబు నుంచి తనకు ప్రాణహానీ ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 




Updated Date - 2021-07-21T20:11:10+05:30 IST