సంబరం వేళ

ABN , First Publish Date - 2020-08-15T06:47:47+05:30 IST

తెలంగాణ ప్రగతిపథం వీర జయంతికా సంరంభం కీర్తి నర్తన సంబరం వేళ

సంబరం వేళ

తెలంగాణ ప్రగతిపథం 

వీర జయంతికా సంరంభం 

కీర్తి నర్తన సంబరం వేళ 

పాట పాడని మనసుండునే 

ఆట ఆడక మనసుంచునే

తెలంగాణ తల్లి మదిని కడిగేన్

తెలంగాణ రైతు పొలాల తడిపేన్ 

తెలంగాణ, దేశం ధాన్యాగారం నింపేన్ 

తెలంగాణ గంగ గోదావరి పైపైకి పారేన్ 

వలస పోయిన పక్షులు తిరిగి వచ్చెన్ 

రంగు వీడిన కళాకారుల ముఖాలు విచ్చెన్ 

యాదాద్రి నరసింహుని మనసు నచ్చెన్‌ 

కోటి ఎకరాల మాగాణి దిశ దాశరథి మెచ్చెన్

 – లక్ష్మణ్‌ దాశరథి

Updated Date - 2020-08-15T06:47:47+05:30 IST