ఆ ప్రాంతంలో క‌రోనాను సంపూర్ణంగా ఎలా క‌ట్ట‌డి చేశారంటే...

ABN , First Publish Date - 2020-07-08T12:19:41+05:30 IST

ప్రపంచ‌మంతా ప్రస్తుతం కరోనా వైరస్‌తో పోరాడుతోంది. భారతదేశంలో ఇప్పటివరకు 7 లక్షల మంది ఈ అంటువ్యాధి బారిన పడ్డారు. అయితే భారతదేశంలోని ఒక ప్రాంతంలో ఈ వైరస్ నీడ కూడా ప‌డ‌లేదు. కేంద్రపాలిత...

ఆ ప్రాంతంలో క‌రోనాను సంపూర్ణంగా ఎలా క‌ట్ట‌డి చేశారంటే...

న్యూఢిల్లీ: ప్రపంచ‌మంతా ప్రస్తుతం కరోనా వైరస్‌తో పోరాడుతోంది. భారతదేశంలో ఇప్పటివరకు 7 లక్షల మంది ఈ అంటువ్యాధి బారిన పడ్డారు. అయితే భారతదేశంలోని ఒక ప్రాంతంలో ఈ వైరస్ నీడ కూడా ప‌డ‌లేదు. కేంద్రపాలిత ప్రాంత‌మైన లక్షద్వీప్‌లో ఒక్క క‌రోనా వైర‌స్ కేసు కూడా న‌మోదు కాలేదు. ఇక్క‌డ క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి గురించి స్థానిక అధికారి ఒక‌రు మాట్లాడుతూ, క‌రోనా వ్యాప్తి గురించి తెలుసుకున్న వెంట‌నే ఇక్కడ‌కు పర్యాటకుల రాకను పూర్తిగా నిషేధించామని తెలిపారు. అలాగే ఈప్రాంతానికి చెందిన వారు ఇక్క‌డికి తిరిగి వ‌చ్చిన‌ప్ప‌డు వారికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని, నెగిటివ్ రిపోర్టు వ‌చ్చిన త‌రువాతే వారిని ఇక్క‌డ ఉండేందుకు అనుమ‌తించామ‌ని చెప్పారు. అందుకే ఇక్క‌డ ప్ర‌స్తుతం ఒక్క క‌రోనా బాధితుడు కూడా లేడ‌ని తెలిపారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ 7,19,665 మందికి క‌రోనా వ్యాధి సోకింది. ఈ వ్యాధి కార‌ణంగా 20,160 మంది మృత్యువాత ప‌డ్డారు. కరోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ 4, 39,948 మంది కోలుకున్నారు. 

Updated Date - 2020-07-08T12:19:41+05:30 IST